కొత్త పాలనకు కసరత్తు
ఇలా ఉండగా, పాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాకు రెండో జాయింట్ కలెక్టర్ పోస్టును ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి టేబుల్ పై తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది. దాదాపు రెండేళ్ళ క్రితం నుండి ఈ ప్రతిపాదనకు ఆలోచన చేస్తున్నప్పటికీ సాంకేతిక అంశాల కారణంగా రెండో జెసి ప్రతిపాదనలో జాప్యం నెలకొంటోంది. అయితే ఈ విధానాన్ని అతి త్వరలో ప్రవేశపెట్టాలన్న భావంతో ప్రభుత్వం ఫైలు కదలికలను వేగవంతం చేస్తోంది. ఉన్న జాయింట్ కలెక్టర్ గానీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అని కానీ నామకరణం చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ పోస్టులో గ్రూప్ - 1 స్థాయి అధికారిని మాత్రమే నియమించనున్నారు.
అయితే ఈ పోస్టులో కేవలం రెవెన్యూ వారినే కాకుండా తమకు కూడా అవకాశం కల్పించాలని గ్రూప్ - 1 ద్వారా అధికారులుగా వచ్చిన వారిలో రెవెన్యూ కాకుండా ఇతర అధికారులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్లు భోగట్టా. పెద్ద పోస్టుల్లో ఐఎఎస్ లకు కాకుండా ఇతరులకు కూడా ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారో, అదేవిధంగా రెండో జాయింట్ కలెక్టర్ పోస్టులో తమకు కూడా అవకాశాలు కల్పించాలని అటవీ, వాణిజ్య పన్నులు వంటి శాఖల్లోని అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ ను కూడా ప్రభుత్వం నిశితింగా పరిశీలిస్తోంది. మొత్తం అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే జిల్లాలో రెండో అధికారి నియామకంపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 17 July, 2009
|