తెదేపాకు గ్రేటర్ తలనొప్పి
హైదరాబాద్: తమ్ముళ్ళ నిరసనరాగాలు, కప్పదాట్లతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలను తమ గుప్పిట పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా నాయుకులు పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పార్టీ ఇన్ చార్జిల పేరుతో బయటి జిల్లాల నుంచి వచ్చిన నేతలు తమపై పెత్తనం సాగించడంపై గ్రేటర్ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించి, నాయకులను పరుగులు పెట్టిస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మాత్రం స్తబ్దత ఆవహించింది. తమను పక్కనబెట్టి ఇతర జిల్లాల వారికి పెత్తనం అప్పగించడం, తమను కొన్ని నియజకవర్గాలకే పరిమితం చేయడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, విజయ రామారావు, సాయన్న, అరవిందకుమార్ గౌడ్ వంటి సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలసాని ఇటీవల జరుగుతున్న సమావేశాలు, టెలీకాన్ఫరెన్సులకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. రెండుసార్లు మంత్రిగా పనిచేసి తనను సైతం ఒక నియోజకవర్గానికి పరిమితం చేయడం ఆయనకు రుచించడం లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కంటో న్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్నను కేవలం ఒక డివిజన్‌కే పరిమితంచేయడం విమర్శలకు దారి తీస్తోంది. నియోజకవర్గ పునర్విభజనకు కంటోన్మెం ట్ పరిధిలోని మల్కాజిగిరికి ఇన్చార్జిగా తనను కాకుండా ఆ నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేని హరీశ్వర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించడంపై సాయన్న అసంతృప్తితో ఉన్నారు.
ఇతరుల మాదిరిగా ఒత్తిళ్లు చేయకుండా అంకిత భావంతో పనిచేయడమే తాము చేస్తున్న పొరపాటని ఆయన తన సన్నిహితుల వద్ద వాపో యినట్లు తెలిసింది. ఉప్పల్‌పై అవగాహన లేకపోయినా హరీశ్వర్‌రెడ్డిని ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మల్కాజిగిరిపై ఆయన ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, మల్కాజిగిరిలో పట్టున్న సీనియర్ కాంగ్రెస్ నేత సూర్యనారాయణరెడ్డి ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరతానని చెప్పినా అడ్డుపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నగరఅధ్యక్షుడిగా పని చేస్తున్న మాజీ మంత్రి విజయరామారావును కూడా తన నియోజకవర్గానికే పరిమితం చేయడం అసం తృప్తికి గురచేస్తోంది. ఇక నగరానికి సుదీర్ఘకాలం ఇన్చార్జిగా వ్యవహరించి, కింది స్థాయి కార్యకర్త లతో కూడా మమేకమయిన గరికపాటి మోహన్ రావును కూడా ఎక్కడా ఈ వ్యవహారంలో భాగస్వామిని చేసిన దాఖలాలు లేవు.
Pages: 1 -2- News Posted: 20 July, 2009
|