తెదేపాకు గ్రేటర్ తలనొప్పి
దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన మేనల్లుడైన సీనియర్ నేత అరవింద కుమార్ గౌడ్‌తో దేవేందర్‌పై విమర్శలు చేయించిన నాయకత్వం, చివరకు కీలకమైన ఎన్నికల సమయంలో ఆయనను పక్కన పెట్టిందన్న విమర్శలు న్నాయి. గతంలో ఆసిఫ్‌నగర్ నుంచి పోటీ చేసిన అరవింద్‌ను గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కడా ఇన్చార్జిగా నియమించకపోవడం ప్రస్తావనార్హం. దీనిపై గౌడ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందన్న భావనను సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. అంబర్‌పేటపై ఏమాత్రం అవ గాహన లేని కడియం శ్రీహరిని అక్కడ ఇన్చార్జిగా నియమించినప్పటికీ, అందులో స్థానిక నేతలకు చోటు లేకపోవడం, బ్రాహ్మణ సామాజికవర్గం ఎక్కువగా ఉండే ముషీరాబాద్‌లో ఆ వర్గానికి చెందిన వేణుగోపాలచారిని మైనారిటీలు ఎక్కువగా ఉండే నాంపల్లికి ఇన్చార్జిగా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నగరానికి చెందిన సీనియర్ అల్లాడి రాజ్‌కుమార్ పేరుకూడా ఇన్చార్జిల జాబితాలో లేకపోవడం బట్టి, నగరంపై ఏమాత్రం అవగాహన లేని వారే ఈ జాబితా రూపొందిం చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సాయన్న కొద్దిరోజులు బయట రాష్ట్రానికి వెళ్లాలని యోచిస్తుం డగా.. తలసాని ఇప్పటికే అంటీముట్టనట్లు వ్యవహ రిస్తున్నారు. అరవిందకుమార్ గౌడ్ కూడా బయటకు వెళ్లాలని యోచిస్తున్నారు. గతంలో జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వరంగల జిల్లా నేతను ఇన్చార్జిగా పంపించడం వల్లే అక్కడ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న విమర్శ లొచ్చాయి. స్వయంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా గ్రేటర్‌ఎన్నికల సమ యంలో ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్థానిక రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేని వారిని ఇన్చార్జిలుగా నియమించడం వల్ల వారు అభ్య ర్ధుల ఎంపికలో జోక్యంచేసుకోవడంతో పార్టీ దెబ్బతింటుందన్న ఆందోళనను పార్టీ నాయకత్వం పట్టించుకున్నట్లు లేదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 20 July, 2009
|