వామపక్షాల అరణ్యరోదన
అయితే కొత్త పొత్తుల కోసం తాపత్రయపడుతున్న రాజకీయ పార్టీలకు ఎవరి అవసరాలు వారికి ఉన్నట్లు కనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలు కొత్త మిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణలో భాగంగానే పీఆర్పీని ఎంచుకుంటున్నాయి. దాదాపు 70 లక్షల ఓట్లుసాధించిన ఆ పార్టీని కూడా సమన్వయం చేసుకుంటే, భవిష్యత్తులో తాము కూడా ఎదగవచ్చన్న రాజకీయ వ్యూహం కూడాలేకపోలేదు. ఐదేళ్ళు ఆపార్టీతో సహవాసం చేసి, చివరి సమయంలో టిడిపితో కాకపోతే పీఆర్పీతో నయినా వెళ్ళవచ్చన్నది మరో ఆలోచన అంటున్నారు. సిపిఎం మాత్రం పీఆర్పీ ధోరణిని విమర్శిస్తోంది. టిడిపితో కలిసే అంశంపై పీఆర్పీ షరతులు విధించడం సరికాదని రాఘవులు కూడా వ్యాఖ్యానించారు.
టిడిపితో కలిసి పనిచేయాలని సొంత పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్, మరికొందరు సీనియర్ నేతలు చేస్తున్న ఒత్తిళ్ళకు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి లొంగడం లేదని తాజా ప్రకటనతో స్పష్టమయింది. టిడిపితో కలిసి వెళితే బాబు పోషించే పెద్దన్నపాత్రలో తమ ఉనికి కోల్పోతామని చిరు భయపడుతున్నారు. పెద్ద పార్టీ పక్కన తాము చేరితే చిన్న పార్టీగా మారడంతోపాటు అసలు ప్రాధాన్యం ఉండదని భావిస్తున్నారు. అదీగాక, చాలామంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వల విసిరిందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కు శత్రువైన టిడిపితో కలసి వెళితే ప్రభుత్వం కక్షగట్టి ఎక్కడ తమ పార్టీని చీలుస్తుందేమోనన్న భయం చిరుకు లేకపోలేదు. కాంగ్రెస్ కు ఇబ్బంది లేనంతకాలం తన పార్టీ ఉనికికి ప్రమాదం లేదని గ్రహించిన చిరంజీవి ఆ మేరకు టిడిపితో కాకుండా వామపక్షాలతో కలిసి వెళ్ళాలని భావిస్తున్నారు. వామపక్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న ఆయన వారితో చెలిమికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వామపక్షాలతో కలిసి వెళితే మేమే పెద్ద పార్టీ అవుతాం అని ఆపార్టీ నేత ఒకరు అసలు విషయాన్ని వెల్లడించారు.
Pages: -1- 2 -3- News Posted: 23 July, 2009
|