వామపక్షాల అరణ్యరోదన
పీఆర్పీతో కలసి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితిలో తమ కొచ్చే లాభమేమీలేదన్నది టిడిపి నాయకత్వ యోచన. వస్తుందనుకున్న అధికారమే దూరమయినప్పుడు పీఆర్పీ వంటి చిన్న పార్టీలతో వెళ్ళడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది టిడిపి నేతల అభిప్రాయం. ఎన్నికలు ముగిసిన తర్వాత చాలామంది పీఆర్పీని వీడుతున్నారు. దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం, కళావెంకట్రావు, పెద్దిరెడ్డితోపాటు, అసెంబ్లీకి పోటీ చేసిన దాదాపు 37 మంది అభ్యర్థులు టిడిపిలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో పీఆర్పీకి అంత ప్రాధాన్యం ఇవ్వడం అనవసరమన్నది కొందరు నేతల వాదన. మరో ఆరు నెలల్లో పీఆర్పీ శిబిరం ఖాళీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదీగాక ఆ పార్టీలోకి తమ నుంచి వెళ్ళిన వారు తప్ప కొత్త నాయకులెవరూ లేరని, ఉన్న నాయకులలో ఎక్కువమంది నియోజకవర్గ స్థాయి కూడా లేనివారే ఉండటం వల్ల పొత్తువల్ల వచ్చేదేమీలోదని సూత్రీకరిస్తున్నారు.
పీఆర్పీ-లోక్ సత్తా పోటీ వల్ల కాంగ్రెస్ కు లాభమన్న వాదాన్ని గట్టిగా వినిపించి ప్రజలకు వివరించి ఆ రెండు పార్టీలపై ఎన్నికల ముందు ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని ప్రణాళిక రూపొందిస్తోంది. అది సఫలమయితే ఆ రెండు పార్టీలు వాటంతట అవే బలహీనమవుతాయన్నది టిడిపి అసలు వ్యూహం. ఇప్పటికే లోక్ సత్తాపై ప్రారంభించిన ప్రచార యుద్ధంలో విద్యావంతులు, మేధావుల ఆలోచనా సరళిలో మార్పు వచ్చినట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యమైన స్థాయిలో ఓట్లు సాధించిన లోక్ సత్తా ఉత్సాహంతోనే ఉన్నప్పటికీ దానిపై పడిన కాంగ్రెస్ ముద్రను తొలగించుకోవడం పైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిజానికి, అలాంటి ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలతో కలసి వెళుతుందని ఆపార్టీ నాయకులు ఆశించారు. కానీ, ఒంటరిగానే పోటీచేస్తామని జెపి స్పష్టం చేయడం లోక్ సత్తా వ్యూహమేమిటన్నది వెల్లడయింది.
Pages: -1- -2- 3 News Posted: 23 July, 2009
|