అసెంబ్లీ అర్ధాంతర వాయిదా
ముద్దుకృష్ణమనాయుడుకి ఆ తరువాత మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వలేదు. అందరూ కూర్చుని సభ సజావుగా నడవటానికి సహకరించాలని కోరారు. సభలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కొత్తగా ఎన్నికైన 147మందికి ఆదర్శప్రాయులుగా మెలగాలని కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.
ఈ స్పందనకు తెలుగదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతృప్తి చెందలేదు. రోశయ్యను సభకు పిలిపించాల్సిందేనని పట్టుపట్టారు. ముద్దు కృష్ణమనాయుడికి క్షమాపణ చెప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిని గురించి తెలుగుదేశం పార్టీ మంగళవారం నాడే స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చామని, ఇప్పటికే స్పీకర్ సుమోటోగా చర్యలు తీసుకుని ఉండాల్సిందని చంద్రబాబు అన్నారు.
ఇలాంటి అవమానం మీకు జరిగితే మీరు సహిస్తారా? అంటూ స్పీకర్ ను ప్రశ్నించారు. వెంటనే మంత్రి రోశయ్యను సభకు పిలిపించండి. క్షమాపణలు చెప్పించండి. అప్పుడే సభ జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రోశయ్య క్షమాపణ చెప్పకుండా సభాకార్యక్రమాలు జరగడం సరైంది కాదని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రసంగంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ముద్దుకృష్ణమనాయుడిని కూర్చోవలసిందిగా స్పీకర్ గట్టిగా చెప్పడంతో తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ వెల్ లోకి దూసుకుపోయారు. ఎంత నియంత్రించాలని ప్రయత్నించినా తెలుగుదేశం సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.
Pages: -1- 2 News Posted: 29 July, 2009
|