మాజీల్లో తాజా ఆశలు!
అదేవిధంగా నామినేటెడ్ పోస్ట్ లు ఇవ్వాలని కోరుతున్న నేతలు కోకొల్లలు. కార్పొరేషన్ సంస్థల ఛైర్మన్ పదవులు, మార్కెట్ యార్డులు, ఆలయాల పాలక మండళ్లు, ఆహార కమిటీలు, తదితర నియామకాల కోసం ఆశిస్తున్నారు. మరో వైపు పదవుల పంపిణీ చేపడితే అసంతృప్తికి బీజం పడుతుందన్న కలవరం మరో వైపు పార్టీలో ఉంది. ఈ కారణంగా త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, 2010లో పురపాలక సంఘాలకు, ఆపై జిల్లాపరిషత్ ఎన్నికల వరకు పదవీ పంపిణీ వాయిదా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సీఎంగా వైఎస్ మొదటి విడత పరిణామాలను ప్రస్తావిస్తున్నారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ విస్తరణ 2007 ఏప్రిల్ 26న తొలిసారిగా వైఎస్ చేశారు. ఈ సమయంలో 17 మంది సభ్యులను చేర్చుకోవడంతో మంత్రివర్గం సంఖ్య 41కి చేరింది. 2005 జులైలో తెరాస మంత్రులు మంత్రి మండలి నుంచి వైదొలగిన తరువాత దాదాపు రెండేళ్లు మంత్రివర్గ విస్తరణ జోలికి వైఎస్ పోలేదు. తీరా మంత్రివర్గ విస్తరణలో అందరూ ఊహించినట్టుగా ఉప ముఖ్యమంత్రి పదవి లేనే లేదు. మంత్రి పదవి వస్తుందని గట్టి ప్రచారం పొందిన నేతలకూ స్థానం లభించ లేదు. నామినేటెడ్ పోస్ట్ ల విషయంలో ఒకసారి మాత్రమే పదవులు ఇచ్చారు. తరువాత ఆయా నామినేటెడ్ పోస్ట్ ల్లో ఇప్పటివరకు నియామకాలే లేవు. అప్పట్లో కూడా పదవుల పంపిణీని వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి పోయిన విషయాన్ని పార్టీవర్గాలు కూడా గుర్తు చేస్తున్నాయి. దరిమిలా.. మంత్రి పదవుల ముచ్చట ప్రచారానికే పరిమితమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ ప్రచారం విస్తరణ జరిగే వరకు పదవీ ఆశావహులకు ఆత్మానందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు!
Pages: -1- -2- 3 News Posted: 3 August, 2009
|