టీమిండియాలో ద్రావిడ్ గాయం కారణంగా వెస్టిండీస్ సిరీస్‌కు దూరంగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తిరిగి జట్టులో చేరాడు. గంభీర్‌తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. దినేష్‌కార్తీక్, యూసుప్ పఠాన్‌లు తమ స్థానాలను నిబెట్టుకున్నారు. జహీర్ నిష్ర్కమణతో ఫాస్ట్‌బౌలింగ్ విభాగంలో ఇషాంత్, ప్రవీణ్‌కుమార్, ఆశీష్‌నెహ్రా, ఆర్పీ సింగ్‌లను జట్టులోకి తీసుకున్నారు. రవీంద్ర జడేజాకు బదులుగా ఈసారి అభిషేక్‌నాయర్‌పై సెలెక్టర్లు మొగ్గుచూపారు.
ముక్కోణపు సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలకు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ అన్నాడు. ప్రస్తుత జట్టు సమతుల్యంగా ఉందని, విజయం సాధించే సత్తా దీనికి ఉందన్నాడు. వచ్చే రెండు టోర్నీల్లో విజేతగా నిలిచే జట్టును ఎంపిక చేశామన్నాడు. అపార అనుభవజ్ఞుడైన ద్రవిడ్ సేవలు ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరమన్నాడు. అందుకే తుదిజట్టులో చోటు ల్పించామన్నాడు. కాగా, గాయం నుంచో కోలుకోక పోవడంతో సెహ్వాగ్‌ను దూరంగా పెట్టాల్సి వచ్చిందన్నాడు.
జట్టు: ధోనీ (కెప్టెన్), యువరాజ్‌సింగ్ (వైస్‌కెప్టెన్) సచిన్, గంభీర్, రైనా, యూసుఫ్‌పఠాన్, ద్రవిడ్, హర్భజన్, ప్రవీణ్‌కుమార్, ఆర్పీసింగ్, ఇషాంత్, ఆశిష్‌నెహ్రా, అభిషేక్‌నాయర్, దినేష్‌కార్తీక్, అమిత్‌మిశ్రా.
Pages: -1- 2 News Posted: 16 August, 2009
|