స్థలం ఆశతోనే వీరూ వలస? సెహ్వాగ్ ఆరోపణలకు ఢిల్లీ క్రికెట్ పెద్దలు కూడా గుసగుసల ప్రచారానికి తెర తీశారు. సెహ్వాగ్ కు ఎమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవచ్చని, అన్నీంటిని తాము చక్కబెడతామని పైకి చెబుతూనే తమదైన ప్రత్యారోపణలను అంతర్గతంగా వ్యాపింపజేస్తున్నారు. అసలు సెహ్వాగ్ హర్యానా వెళ్ళిపోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, హర్యానా ప్రభుత్వం సెహ్వాగ్ కు 23 ఎకరాలు భూమిని ఇచ్చిందని, దాని కోసమే సెహ్వాగ్ వెళుతున్నాడని చెబుతున్నారు. సెహ్వాగ్ స్వస్థలమైన ఝజ్జార్ పట్టణానికి సమీపంలోని సిలాని కేషో గ్రామంలో ఈ భూమిని కేటాయిస్తున్నారని, అక్కడ క్రీడా అకాడమీని అభివృద్ధి చేయడానికి హర్యానా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని వివరిస్తున్నారు.
ఇంతకాలం ఊరుకొని ఇప్పుడే సెహ్వాగ్ ఎందుకు రాద్ధాంతం చేస్తునట్లని ఢిల్లీ క్రికెట్ సంఘం సభ్యుడొకరు ప్రశ్నించారు. సెహ్వాగ్ కు కోపం రావడానికి కారణం ఏమిటని ఆయన అడిగారు. సంవత్సరానికి మహా అయితే రెండు మ్యాచ్ లు ఢిల్లీ కోసం ఆడతాడని అన్నారు. అయినా ఢిల్లీ రంజీ టీంలో సెహ్వాగ్, గంభీర్, ఆకాష్ చోప్రా, షికర్ ధావన్, మిథున్ మన్హాస్, రాజత్ భాటియా, విరాట్ కోహ్లీ లాంటి ఫ్రంట్ లైన్ బ్యాట్స్ మెన్, పునీత్ భాటియా వికెట్ కీపర్, చేతన్య నందా స్పిన్నర్, ఇషాంత్ శర్మ, ఆశిష్ నెహ్రా, ప్రదీప్ సంగ్వాన్ లాంటి పేసర్లు ఉండగా ఇంక సొంత మనుషుల్ని అక్రమంగా ఎంపిక చేయడానికి అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. కాని అక్రమాలు జిరగేదంతా అండర్-16, అండర్-19 టీమ్ ఎంపికలోనే అనేది సీనియర్ల అభియోగం. దీనిని గురించి మాత్రం పెద్దలు ప్రస్తావించడం లేదు.
ఏదిఏమైనా మరో రెండు వారాల్లో ఈ డాషింగ్ బ్యాట్సమన్, ఢిల్లీ రంజీ కెప్టెన్ హర్యనాకు వెళ్ళిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే సెహ్వాగ్ హర్యానకు వెళ్ళిపోవడానకి మానసికంగా సిద్ధమైపోయాడని, తనతో బాటు మరికొంత మంది సీనియర్లను తీసుకవస్తానని హర్యానా ప్రభుత్వానికి మాట ఇచ్చాడని అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 18 August, 2009
|