పెళ్లికి సిద్ధంగా శ్రీశాంత్ తరువాత డొనాల్డ్ తో మాట్లాడానని, నీకు మంచి రోజులు వచ్చాయంటూ ఆయన వార్విక్ షైర్ జట్టులోకి ఆహ్వానించాడని శ్రీశాంత్ చెప్పాడు. `నిజాయితీ చెప్పాలంటే నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు. భారత్ జట్టులో లేను. కాని ఇక్కడ క్రికెట్లోకి పునరాగమనం చేయడాన్ని ఇష్టపడుతున్నన' శ్రశాంత్ అన్నాడు. తను మరో కౌంటీకి ఆడబోనని, డొనాల్డ్ ఉన్న వార్విక్ షైర్ కే ఆడతానని తెలిపాడు. గతంలో వలె ఇంకా ఆవేశపరునిగానే ఉన్నావా? అన్న ప్రశ్నకు ఈ ఫాస్ట్ బౌలర్ దూకుడుగానే స్పందించాడు. `తాను ఆవేశాన్ని చంపేసుకున్నానని చెప్పలేనని' అన్నాడు. కానీ తాను గతంలో కంటే పరిణితిని సాధించానని, తనకు ఇప్పుడు 26 సంవత్సరాలని, మరో పదేళ్ళ క్రికెట్ భవిష్యత్ తనకు ఉందని వివరించాడు. ఈ దశాబ్దం తన జీవితంలో ఉత్తమంగా నిలిచిపోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తాను తాత్వికుడినని, చదవడాన్ని, మనుషుల్ని కలవడాన్ని, వారితో మాట్లాడాన్ని, వారితో మమేకం కావడాన్ని ప్రేమిస్తానని, విభిన్న ప్రాంతాల వ్యక్తుల పరిచయంతో వారి సంస్కృతిని, సంప్రదాయాలను తెలుసుకోవడం తనకు ఇష్టమని శ్రీశాంత్ చెప్పాడు.
`నా గురించి నాకు ఇప్పుడే బాగా తెలుస్తోంది. నాకేం కావాలో, జీవితంలో ఏం పొందాలో అర్ధం అవుతోంది. గత యేడాది ఏం జరిగిందన్నది నేను పట్టించుకోన'ని అన్నాడు. తాను తిరిగి భారత జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని, ప్రపంచ కప్ లో ఆడటం తన కలని శ్రీశాంత్ చెప్పాడు. ఛాంపియన్ ట్రోఫీ, శ్రీలంక ముక్కోణపు సీరిస్ లోకి తిరిగి రావడం ద్వారా రాహుల్ ద్రావిడ్ తనకు మార్గనిర్దేశం చేశాడని అన్నాడు. తాను వివాహం చేసుకుని స్థిరపడటానికి ప్రయత్నిస్తున్నాని, అందరు మళయాళీ తల్లితండ్రుల్లానే తమ 26 యేళ్ళ కొడుకుకు సంబంధాలు చూస్తున్నారని శ్రీశాంత్ వెల్లడించాడు. నాలుగైదు సంబంధాలు చూసారని, త్వరలోనే తన పెళ్ళి ఖాయమవుతుందని అన్నాడు. తన సెలబ్రిటీ హోదాను చూసి కాకుండా తనను అర్ధం చేసుకునే జీవిత భాగస్వామి తనకు కావాలని శ్రీశాంత్ ఆకాంక్షించాడు.
తాను సినిమాలల్లో నటించే సరదాను తీర్చుకుంటానని, ఇప్పటికే పెద్ద బ్యానర్ల కింద మూడు హిందీ సినిమాల్లో నటించానని శ్రీశాంత్ చెప్పాడు. ముమ్ముట్టితో మళయాళంలో నటించాలన్న తన కోరిక నెరవేరేదేనని, గాయం కారణంగా డాడీ కూల్ చిత్రంలో నటించలేకపోయానని చెప్పాడు. డాన్స్ చేయడంలో, పాటలు పాడటంలో నేర్పరి అయిన శ్రీశాంత్ బొమ్మలు కూడా గీస్తాడు. తాను బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందడానకే ఇష్టపడతానని చెప్పాడు. త్వరలోనే తాను పుస్తకం రాస్తానని, అది తన జీవితచరిత్ర కాదని, కానీ రాసేది మాత్రం జీవితం గురించేనని వివరించాడు.
Pages: -1- 2 News Posted: 25 August, 2009
|