సల్మాన్ కు ఐపిఎల్ కష్టమేనా?
ఐపిఎల్ కొత్త జట్ల కోసం డిసెంబర్ లో టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టుతుంది. కొత్త జట్ల పేర్లను వచ్చే సంవత్సరం జనవరిలో ప్రకటించవచ్చు. ఈ దశలో అహ్మదాబాద్, నాగపూర్, రాజకోట, విశాఖపట్నం నగరాలకు కొత్త ఫ్రాంచైజీలు ఉండవచ్చు.
సల్మాన్ కు దేశంలోను, విదేశాలలోను గల వాణిజ్య సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకాగలదు. ఉదాహరణకు అనిల్ అంబానీ అహ్మదాబాద్ జట్టు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయన మూడేళ్ళ క్రితం కొద్దిలో ఆ అవకాశాన్ని కోల్పోయారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన ఒక ప్రముఖ వాణిజ్యవేత్త కూడా ఒక జట్టును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) కూడా ఒక జట్టు కొనుగోలుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇక సల్మాన్ కు చిత్ర పరిశ్రమ నుంచే పోటీ ఎదురుకావచ్చు. నటులు సంజయ్ దత్, అజయ్ దేవగణ్ కూడా ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.
సల్మాన్ ఖాన్ ఒక వాణిజ్య సంస్థ సహకారంతో ఐపిఎల్ జట్టు కొనుగోలుకు ప్రయత్నించగలరని తెలుస్తున్నది. అయితే, కొనుగోలు చేయవలసింది కొత్త జట్టునా లేక ఇప్పటి జట్లలో ఒకదానినా అనేది సల్మాన్ ఇంకా తేల్చుకోలేదని ఆయన సన్నిహతులు చెబుతున్నారు.
ఏమైనా రెండు ప్రముఖ కార్పొరేట్ సంస్థల అండ ఉన్నప్పటికీ ఐపిఎల్ జట్టును కొనుగోలు చేయడం సల్మాన్ ఖాన్ కు తేలికేమీ కాకపోవచ్చు. 'పరిస్థితులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి' అని సల్మాన్ ఖాన్ కుటుంబంతో సాన్నిహిత్యం గల ఒక ప్రతినిధి చెప్పారు 'ఐపిఎల్ ఏక్షన్ ప్లాన్'లో ఆయన కుటుంబం కూడా భాగం కావచ్చు. 'కేవలం బిడ్డింగ్ కు పెద్ద మొత్తం వెచ్చించవలసి ఉంటుంది. మేము కృతకృత్యులం కావాలంటే కొన్ని కార్పొరేట్ సంస్థల అండ అవసరం కాగలదు' అని ఆ ప్రతినిధి సూచించారు.
Pages: -1- 2 -3- News Posted: 27 August, 2009
|