సల్మాన్ కు ఐపిఎల్ కష్టమేనా?
ఐపిఎల్ గడచిన రెండు సంవత్సరాలలో ఊహించిన స్థాయి కన్నా వేగంగా వృద్ధి చెందింది. ఎనిమిది జట్ల ఐపిఎల్ ను పది జట్ల లీగ్ కు విస్తరించనున్నారు. రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇప్పటికే 29 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. టెండర్ నోటీసులు జారీ చేసే సమయానికి ఐపిఎల్ జట్ల కొనుగోలుపై ఆసక్తి ఉన్న వారి సంఖ్య మరింత పెరగవచ్చు.
కాగా, 'ఇది తొందరపాటే అవుతుంది. ఒక జట్టు కొనుగోలుకు ఆయనకు గల అవకాశాలపై నేను వ్యాఖ్యానించజాలను' అని ఐపిఎల్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు. 'మేము ప్రారంభించినప్పుడు ఐపిఎల్ ఒక అనామక సంస్థ. అది ఎలా పని చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడేమో ఇది అందరికీ కావలసి వస్తున్నది. పోటీ ముమ్మరంగా ఉండగలదు' అని ఆయన అన్నారు.
2011లో వేలంపాట సమయానికి పది ఐపిఎల్ జట్లన్నిటికీ సమానావకాశాలు కల్పించాలనేది ప్రస్తుత ఆలోచన. 'జనవరికల్లా అంతా పూర్తి చేయాలని మేము అభిలషిస్తున్నాం. దీని వల్ల వేలం పాటకు ముందు క్రీడాకారులందరూ అన్ని జట్లకూ సమానంగా అందుబాటులో ఉంటారు' అని లలిత్ మోడి చెప్పారు. ఆయన బుధవారం దాదాపు 45 నిమిషాల సేపు ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో సల్మాన్ ఖాన్ తో చర్చలు జరిపారు. సల్మాన్ దాదాపు ఆరు నెలల క్రితం మోడితో ఈ విషయమై ముందుగా చర్చించినట్లు తెలుస్తున్నది.
'క్రీడాకారుల విషయం చూసేందుకు ఒక ప్రొఫెషనల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలషిస్తున్నాం. అయితే, ఈ నిర్వహణ బాధ్యతలను ఒక మాజీ క్రికెటర్ కు అప్పగించాలని సల్మాన్ సూచించారు' అని సల్మాన్ కుటుంబ స్నేహితుడు ఒకరు తెలియజేశారు. 'అది అద్భుతమైన సలహా అని మేమందరమూ భావిస్తున్నాం' అని ఆయన చెప్పారు.
అయితే, అంతా అత్యంత 'ప్రాథమిక దశ'లోనే ఉందని, ఏదీ ఖరారు కాలేదని ఆ మిత్రుడు చెప్పారు. 'ఒక ఐపిఎల్ జట్టులో వాటా ఉండాలని, ఒక కొత్త జట్టులో వాటా ఉండాలని సల్మాన్ కోరుకుంటున్నారనేది మాత్రం వాస్తవం' అని ఆయన చెప్పారు. 'భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. మేము అంతా సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక జట్టును సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నామని చెబుతున్నామంటే ఒక జట్టు మాకు ఉందని అర్థం కాదు కనుక బిడ్డింగ్ ప్రక్రియ కోసం మేము సన్నద్ధం కావలసి ఉంటుంది' అని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 27 August, 2009
|