రిలయన్స్ పై చిరు నిప్పులు
రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ 100 రోజులైనా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని చిరంజీవి ఎద్దేవా చేశారు. మరోసారి అధికార పీఠం ఎలా దక్కించుకోవాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ, పోయిన అధికారాన్ని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలా అనే లక్ష్యంతో మాత్రమే టిడిపి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి తప్ప ప్రజా సమస్యలంటే కొంచెమైనా వాటికి పట్టడం లేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవాలన్న కోరికతో మాత్రమే ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ అంటూ వట్టి గ్యాస్ మాటలు వైఎస్ వల్లిస్తున్నారని చిరంజీవి అన్నారు. ప్రజల మీద ప్రభుత్వానికి అవగాహన లేదని చిరంజీవి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, టిడిపిల తీరు చూస్తుంటే విసుగుపుడుతోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపూ ఆ రెండు పార్టీలో శాసనసభా వేదికని కబ్జా చేస్తున్నాయని, ఇతర పార్టీలు మాట్లాడేందుకు కనీసం పది నిమిషాలు కూడా సమయం దొరక్కుండా చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజా సమయాన్ని, ధనాన్ని ఆ రెండు పార్టీలూ దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.
'సాధిద్దాం... సాధిద్దాం... మన గ్యాస్ మనం సాధిద్దాం' అంటూ సభకు హాజరైన అశేష ప్రజానీకం చేత నినాదాలు చేయించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చిన ప్రజారాజ్యం పార్టీ మహా ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు సత్యానందం, జ్యోతుల నెహ్రూ, కురసా కన్నబాబు, కోటగిరి విద్యాధరరావు, సి.రామచంద్రయ్య, వంగా గీత, డాక్టర్ మెట్ల సత్యనారాయణ తదితరులు ముందుగా ప్రసంగించారు. చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు, పార్టీ నాయకుడు వి.ఆర్. నారగోని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన వందలాది మంది ఈ మహా ధర్నాలో పాల్గొన్నారు.
కాకినాడలో ఉదయాన్నే రైలు దిగిన చిరంజీవి ముందుగా గాడిమొగ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడి రిలయన్స్ చమురుక్షేత్రాన్ని సందర్శించి మత్స్యకారులు, స్థానికులతో గంటన్నరకు పైగా చర్చించారు. రిలయన్స్ టెర్మినల్ తో ఉపాధి కోల్పోయిన వారితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నానికి తిరిగి కాకినాడ చేరుకున్న చిరంజీవి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రిలయన్స్ గ్యాస్ పై మహా ధర్నాను ప్రారంభించారు.
Pages: -1- -2- 3 News Posted: 29 August, 2009
|