జీహాదీల ప్రేమ ఉచ్చు? దాంతో వారి తల్లితండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. తాము ఆ అబ్బాయి ఉచ్చులో చిక్కుకున్నామని, అతనితో తిరిగి వెళ్ళబోమని ఇద్దరు అమ్మాయిలూ కోర్టుకు విన్నవించుకున్నారు. వీరిలో ఒక అమ్మాయి అతనిని పెళ్ళి చేసుకుంది. మరో అమ్మాయిని కూడా తన మిత్రుడు బస్ కండక్టర్ గా పనిచేస్తున్న వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోమని ఆ అబ్బాయి బలవంతం చేశాడు. తమకు అతను జీహాదీ విడియో కేసెట్లను చూపించేవాడని, సాహిత్యం చదివించేవాడని తమను కూడా పవిత్రయుద్ధంలో పాల్గొనమని బలవంతం చేసేవాడని వారు కోర్టుకు వివరించారు. దాంతో ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
హస్టల్ లోని అమ్మాయిల గదిని పరిశీలించినప్పుడు జీహాదీని గురించి బోధించే వీడియోలు, పుస్తకాలు దొరికాయని, వాటిని పోలీసులకు అందచేశామని ప్రిన్సిపాల్ చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, కాని రాజకీయ కారణాలతో తమను దర్యాప్తు జరపనివ్వలేదని పోలీసు వర్గాలు వివరించాయి. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందన్న అనుమానాలు తమకు ఉన్నాయని, అన్ని కళాశాలల్లోనూ ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయని వారు పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 1 September, 2009
|