ప్రజానాడిని పట్టిన వైఎస్ జన్మత: భూస్వామిగా జన్మించిన వైఎస్ఆర్ వృత్తి రీత్యా వైద్యుడు. మత విశ్వాసిగా క్రైస్తవుడు. ఆంధ్రప్రదేశ్ కు సమర్థ ముఖ్యమంత్రిగా మార్కులు కొట్టేసినా... క్రీస్తు జన్మస్థలమైన జెరూసలేంలో - బైబిల్ పట్టుకొని సామాన్య భక్తునిగా ప్రార్థనలు చేశారు. రోజూ ప్రార్థనతో దైనందిన కార్యక్రమాలను ప్రారంభించే జననేత వైఎస్ - తిరుమలేశుని భక్తుడు కూడా. ఇటీవల కాలంలో తిరుమల పట్ల విశేషంగా శ్రద్ద చూపిన ఆయన వీఐపీల వల్ల సామాన్య భక్తులకు స్వామి దర్శనంలో ఇబ్బంది లేకుండా చూడాలని అనేక పర్యాయాలు అధికారులను ఆదేశించారు. 2003లో రాష్ట్రంలో 1400 కిలోమీటర్ల పాతదాయత్ర, 2004 ఎన్నికల సమయంలో జైత్రయాత్ర సాగించిన వైఎస్ కు ప్రజలనాడి పట్టడంలో నైపుణ్యం అబ్బింది. 10 ఏళ్ళ తరువాత రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో తనకు - ప్రజలు, దైవం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని వైఎస్ ఆర్ విశ్వసించేవారు.
2008లో రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థ ప్రగతి చక్రాలపై పరుగులెత్తే స్థితిలో ఉండటానికి కారణం వైఎస్ ప్రారంభించిన అనే సంక్షేమ పథకాలే! రాజీవ్ పేరిట ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ పేరిట ఇళ్ళు, డ్వాక్రా మహిళలకు పెన్షన్ల పథకం ఆయనకు ఎనలేని పేరు తెచ్చి పెట్టాయి. 2004 ఎన్నికల్లో ఆయన ప్రయోగించిన 'తురుపు ముక్క' రైతులకు ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ పట్ల ఓటర్ల మొగ్గుకు కారణమైంది. 'రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా... ప్రజలు వైఎస్ కు మొర పెట్టుకున్న సమస్యల్లోంచి ఆయన రూపొందించినవే' అని వైఎస్ సన్నిహితుడు, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ముక్కు సూటిగా మాట్లాడే మనిషిగా పేరున్న వైఎస్ తన ప్రభుత్వం పని తీరుపై ప్రతినెలా ఢిల్లీలోని అధిష్టానానికి నివేదిక పంపేవారు.
Pages: -1- 2 -3- News Posted: 4 September, 2009
|