హెలికాప్టర్లకు లీడర్లే పైలట్లా? బీహార్ ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ మీటింగ్ కు జనాలు వచ్చేవరకు తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను గాలిలో చక్కర్లు కొడుతూ ఉండవల్సిందిగా కోరారని ఓ సీనియర్ పైలట్ వివరించారు. ఒకసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కింద ఉన్న ప్రజల ఆగ్రహాన్ని గ్రహించలేక తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను కింద నున్న ప్రజలకు సమీపానికి తీసుకువెళ్ళాలని పైలట్ ను ఆదేశించారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువ సభల్లో మాట్లాడాలన్న ఆతృతకొద్దీ హెలికాప్టర్ స్థితి గతులను గమనించకుండా రాజకీయ నాయకులు వాటిని నడపాలని పైలట్లను బలవంత పెడుతున్నారని ఆయన చెప్పారు. ఒక పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత హెలికాప్టర్ ను తప్పనిసరిగా పరీక్షించి తీరాలని కానీ, రాజకీయ నాయకులు అలాంటి అవకాశాలను హెలికాప్టర్ సంస్థలకు ఇవ్వడంలేదని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. అర్థరాత్రి తిరిగి వచ్చి, మళ్ళీ తెల్లవారు జామూనే బయలుదేరడం చాలా ప్రమాదకరమని ఆయన వివరించారు.
ఒకసారి హెలికాప్టర్ లో ఇంధనం అయిపోయిందని పైలట్ మొత్తుకుంటున్నా దానిలో ప్రయాణిస్తున్న పశ్చిమ బెంగాల్ నాయకురాలు మమతా బెనర్జీ, ప్రణబ్ ముఖర్జీలు వినిపించుకోలేదని చివరకు పైలట్ ఎక్కడో అత్యవసరంగా హెలికాప్టర్ ను దించేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ నాన్ స్టాప్ గా హెలికాప్టర్ ను వినియోగించారని మర్నాడు ఉదయాన్నే బయలుదేరాలని నాయకులు ఒత్తిడి చేయడంతో పైలట్ ఇతర సాంకేతిక సిబ్బంది ఇంధనం ఎంత ఉన్నదీ చూసుకోవడం మరచిపోయారని ఆయన వివరించారు.
Pages: -1- 2 -3- News Posted: 4 September, 2009
|