హెలికాప్టర్లకు లీడర్లే పైలట్లా? పైలట్లను ఈ రాజకీయ నేతలు కఠినంగా ఆదేశించకపోయినా మర్యాదపూర్వకమైన భాషలో చేసే విన్నపం కూడా పైలట్లపై అంతే ఒత్తిడిని కలుగజేస్తాయని దాంతో వారు తాత్కాలికంగా వైమానిక నియమ నిబంధనలను పక్కనపెడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కోరికమేరకు పైలట్లు తప్పని పరిస్థితుల్లో మార్గాలు మార్చుకుని సిగ్నల్స్ అందని ప్రాంతాల్లో ప్రయాణించిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని మరో సీనియర్ పైలట్ చెప్పారు. ప్రతికూల వాతావరణం, అంతవరకూ పైలట్ ఎప్పుడూ ప్రయాణించని మార్గాలు ప్రమాదాలను ఆహ్వానిస్తాయని ఆయన తెలిపారు.
వైఎస్ ప్రాణాలను అనంత వాయువుల్లోకి కలిపేసిన హెలికాప్టర్ ప్రమాదం వెనుక కూడా ఒత్తిడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ముందుగా నిర్దేశించుకున్న మార్గంలో కాకుండా ప్రమాదకరమైన నల్లమల మార్గానికి హెలికాప్టర్ ను ఎందుకు మరల్చారో తెలుసుకోవాలని చెబుతున్నారు. బహుశా వైఎస్ కు ఉన్న ఒక సరదా మార్గాన్ని మార్చుకోవడానికి కారణమైందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. బాగా వర్షాలు కురిశాయి కాబట్టి వెలుగోడు ప్రాజెక్ట్ కళకళాడుతూ ఉంటుందని దానిని చూడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించి ఉండవచ్చునని అంటున్నారు. అలానే రచ్చబండ కార్యక్రమానికి ఎలాగైనా వెళ్ళి తీరాలని ఆయన పైలట్లను కోరి ఉండవచ్చునని, అందువల్లనే అనుభవజ్ఞులైన పైలట్లు అతి విశ్వాసంతో ముందుకు సాగి ఉంటారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకుల ఆదేశాలో, విన్నపాలో పైలట్లను ప్రభావితం చేస్తున్నాయని అందువలనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 4 September, 2009
|