వెలగని వారసులు రాష్ట్రానికి 1971-73లో ముఖ్యమంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావుని భూసంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిగా పేరుంది. తరువాత ఆయన ప్రధానిగా కూడా పనిచేసి, సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కించారు కూడా. ఆయన కుమారులు పీవీ రంగారావు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తరువాత రాజకీయ పథంలో కనుమరుగయ్యారు. మరో కుమారుడు పీవీ రాజేశ్వరరావు కూడా రాజకీయాల్లో రాణించింది లేదు. మరో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి దత్తపుత్రుడుడైన కాసు కృష్ణా రెడ్డి కూడా రాజకీయాల్లో ప్రభావితం చూపలేకపోయారు. గుంటూరు జిల్లాలో ఈ కాసు కృష్ణారెడ్డి పల్నాడుకే పరిమితమయ్యారు. అదే సమయంలో దివంగత వైఎస్ కు సహాధ్యాయి, స్నేహితుడు అయిన కారణంగా వైఎస్ తొలి కేబినెట్ లో కాసుకు స్థానం లభించింది. పౌరసరఫరాల శాఖాధికారిగా కాసు తన పనితనాన్ని నిరూపించుకోలేకపోయారు. ఒక సందర్భంలో పౌరసరఫరాల శాఖ సమాచారం విషయమై విలేఖరుల సమక్షంలోనే మంత్రి కాసుకు సీఎం వైఎస్ క్లాస్ పీకారు! 2009 ఎన్నికల అనంతరం కేబినెట్ లో కాసుకు వైఎస్ స్థానాన్ని తిరస్కరించారు.
రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో 'పెద్దాయన'గా తనదైన ముద్ర వేసిన కోట్ల విజయభాసర రెడ్డి కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా, ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేసిన కోట్లకు కాంగ్రెస్ లో మంచి పట్టే ఉంది. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా ఎన్నికైనా... మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు. పార్టీలో కూడా ప్రముఖ పాత్ర ఏమీ లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో పరిపాలనాద్యక్షుడిగా గుర్తింపు ఉన్న జలగం వెంగళరావు వారసులకు కూడా కాంగ్రెస్ లో ప్రాముఖ్యత ఏమీ లేదు. ఆయన కుమారుడు జలగం వెంకట్రావ్ కు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది.
Pages: -1- 2 -3- News Posted: 5 September, 2009
|