తెలుగుజాతి ఆత్మ గౌరవ నినాదంతో తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ వారసత్వం రాజకీయాల్లో కనిపించడం లేదు. మూడుసార్లు రాష్ట్రానికి సీఎంగా ఎన్టీఆర్ పనిచేశారు. తెలుగుదేశంలో నెలకొన్న సంక్షోభం అనంతరం జరిగిన పరిణామాల్లో అల్లుడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా నందమూరి హరికృష్ణ పనిచేశారు. కొద్ది కాలంలోనే ఆ మంత్రి పదవికి రాజీనామా చేసిన హరికృష్ణ సొంతంగా 'అన్న తెలుగుదేశం' పార్టీని స్థాపించినా... ప్రయోజనం లేకపోయింది. తిరిగి బావ చంద్రబాబు నాయకత్వంలోనే తెలుగుదేశంలోనే చేరవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి యూపీఎ కేబినెట్ లో మంత్రిగా రాణిస్తున్నారు!