జగన్...ఓ సంచలనం
వ్యక్తిగత వ్యవహారశైలిలో జగన్ చాలా మర్యాదగా, మన్ననగా మసలుతారు. ఎల్లవేళలా ముఖంపై కదలాడే చిరునవ్వు... కత్తి కంటే పదునైన ఆయన మేధస్సును బయటపడనీయకుండా కాపాడుతూ ఉంటుంది. కడప ఎంపీగా గెలిచి వందరోజులు గడిచింది. అప్పటినుంచి రాష్ట్రంలో తన వ్యాపార కార్యకలాపాలను జగన్ కర్నాటక రాజధాని బెంగుళూరు నుంచే నడుపుతున్నరని వినికిడి. ఇప్పుడు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జగన్ బెంగుళూరు నుంచే కంటి చూపుతో శాసిస్తున్నారని బాగా ప్రచారంలో ఉంది.
వాస్తవానికి ఆంధ్రరాష్ట్రంలో భూ సంస్కరణలు ఎప్పుడూ సంపూర్ణంగా అమలైంది లేదు. పెద్దపెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు... అంటే తాజాగా దురదృష్టవంతుడు సత్యం రామలింగరాజుతో సహా... పరిమితికి మించి భూములను సంపాదించాలని ఆశపడిన వారేనని చెప్పడంలో అతిశయోక్తి ఏమైనా ఉందా? జగన్ కూడా దానికి అతీతుడేం కాదని, నిజానికి భావి ముఖ్యమంత్రిగా కుమారుడు జగన్ ను నిలబెట్టడానకి స్వయంగా వైఎస్సే రియాల్టర్లతో బహిరంగ లాబీయింగ్ చేశారన్న ప్రచారం కూడా విస్తృతంగా ఉన్నమాట రాజధాని వాసులందరికీ తెలుసు కదా?
అది సరే కడప ఎంపీ గా గెలిచిన తరువాత రాష్ట్ర రాజకీయాలలో తన ముద్రను ప్రదర్శించడానికి జగన్ యత్నాలు ప్రారంభించారు. ఢిల్లీలో ఆయన చాలా చురుకైన పాత్రను పోషించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రిత్వశాఖలను కలిసిన రాష్ట్ర ఎంపీల బృందానకి జగన్ నాయకత్వం వహించారు. భావి భారత ప్రధానిగా భావిస్తున్న యువనేత రాహుల్ గాంధీతో మంచి స్నేహ బాంధవ్యాలను పెంచుకోడానికి జగన్ పునాదులు వేసుకున్నారు.
హైదరాబాద్ లో రెడ్డి రాజుల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి స్వర్గీయ వైఎస్ ఏమీ వెనుకంజ వేయలేదు. అనేక మంది భారతీయ రాజకీయవేత్తలు గతంలోనూ, వర్తమానంలోనూ అనుసరిస్తున్న మార్గాన్నే వైఎస్ సైతం ఎంచుకున్నారు. రాజకీయ పండితుల కథనం ప్రకారం 2014 ఎన్నికల నాటికి వైఎస్ కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించాలని భావించారు. తనకు వారసునిగా ఆంధ్రకు జగన్ రావాలని ఆకాంక్షించారు. కానీ, ఆయన ఆకస్మక మరణం ఆయన అలోచనలను బాగా ముందుకు తీసుకువచ్చేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిమాలయ శిఖరంలా తన ఎదురుగా కనిపిస్తున్న ఎత్తులను అధిరోహించడానికి, ప్రత్యర్ధుల ఎత్తుగడలను అధిగమించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారా మరి?
Pages: -1- -2- 3 News Posted: 5 September, 2009
|