పులివెందులకు నిధుల చింత! హైదరాబాద్ : ఇడుపులపాయ అనగానే రాష్ట్రంలో ఎవరికైనా వైఎస్ గుర్తుకు రాక మానరు. రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి ఒక ఎత్తు అయితే... ఇడుపులపాయ ఒక ఎత్తు... ఎందుకంటే... అది... వైఎస్ రాజశేఖరరెడ్డికి తలపులపాయ! సీఎంగా వైఎస్ ఆయన స్వస్థలం పులివెందులకు వరాల జల్లు కురిపించారు. ఐదారేళ్ళుగా పులివెందుల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు నిధుల కొరత రానీయని వైఎస్, అక్కడ అభివృద్ధికి దోహదపడే ఏ అంశాన్నీ వదిలి పెట్టలేదు. పదుల సంఖ్యలో విద్యాసంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా వైఎస్ అనుమతినిచ్చారు. వైఎస్ ఆకస్మిక మృతితో ఆయా సంస్థల భవితవ్యం గురించి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడపజిల్లాలో చిన్న పట్టణమైన పులివెందులకు అవుటర్ రింగ్ రోడ్ ను కూడా వైఎస్ నిర్మించారు! ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీని 2006లో నెలకొల్పారు. 2008లో పుడ్ సైన్స్, టెక్నాలజీ కాలేజీ, 2009లో పశు పరిశోధనా సంస్థలను నెలకొల్పారు. ఇవి కాక బాలికల జూనియర్ కళాశాల, ఇతర విద్యాసంస్థలు, డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా వైఎస్ కారణంగానే ఏర్పడ్డాయని విద్యారంగం నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 7 September, 2009
|