ఎంతటి నిర్లక్ష్యం! ఇక ఇంటలిజెన్స్ అధికారుల తీరుపై కూడా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. సరైన సమాచారాన్ని సేకరించడంలో వారి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తుత్నాయి. ఉదయం తొమ్మిదన్న గంటలకు ప్రమాదం సంభవించినా వివరాలు సేకరించడంలో నిఘా వైఫల్యం, క్షేత్రస్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో ఎస్పీ, కలక్టర్ల పనితీరుపై కూడా ప్రభుత్వం అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. అలాగే కడప జిల్లాలో వైఎస్ అంతిమ సంస్కారం నిర్వహణలో లోటుపాట్లకు అక్కడి అధికారులను బాధ్యులను చేయాలన్న భావాన్ని కూడా కొంత మంది మంత్రులు ముఖ్యమంత్రి వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే విధంగా అంతిమ సంస్కారం సమయంలో డిజిపి నేరుగా హెలికాప్టర్ లో ఇడుపుల పాయకు చేరుకోగా, రాష్ట్ర హోమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి రహదారిపై పయనించి ట్రాఫిక్ లో ఉండిపోవడం వంటి అంశాలపై మంత్రులు ముఖ్యమంత్రి రోశయ్య వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 8 September, 2009
|