సైంటిస్ట్ పై కక్ష
బృందం నివేదిక ప్రకారం రాయ్ 'మా అహాన్ని దెబ్బ తీశారు' అని నైపర్ డీన్ శరణ్ జీత్ సింగ్ ఆ బృందంతో చెప్పారు. రాయ్ ఉత్తమ సైంటిస్టా కాదా అనేది వారికి అక్కరలేక పోయింది. రాయ్ ని మరే నైపర్ లోనైనా నియమించవచ్చునని, కాని చండీగఢ్ లోనే ఆయనను పునర్నిర్మించిన పక్షంలో సింగ్, మరి ముగ్గురు 'నిరసన సూచకంగా రాజీనామా' చేయగలరని సింగ్ ఆ బృందంతో చెప్పారు.
గడచిన మూడేళ్ళలో కొచ్చిన్, ఢిల్లీ, లక్నో, ముంబై, నిర్జూలి (అరుణాచల్ ప్రదేశ్), పుణె, తిరుపతి, వారణాసిలలోని పబ్లిక్ ఇన్ స్టిట్యూషన్లలో పరిశోధన పరంగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 'ఇవి పదే పదే జరుగుతుండడం చూస్తూనే ఉంటాం. ఇన్ స్టిట్యూషన్లు ఆరోపణలను ఖండిస్తూనే ఉంటాయి. చర్య తీసుకోవడాన్ని ఆలస్యం చేస్తుంటాయి. ఆతరువాత ఆరోపణలను నీరుగారుస్తుంటాయి' అని న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ నందుల రఘురామ్ పేర్కొన్నారు. ఎస్ఎస్ వి సభ్యుడుగా ఆయన ఇటువంటి అక్రమాల కేసులు పన్నెండింటిపై దర్యాప్తు జరిపారు.
సైన్స్ పరిశోధన వంటి విషయాలలో అక్రమ ప్రవర్తనలపై దర్యాప్తు జరిపేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఎస్ఎస్ వి చాలా కాలంగా కోరుతూన్నది. 'ఇది సమంజసమైన అభ్యర్థన అనే భావిస్తున్నాను' అని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మాజీ డైరెక్టర్ గోవర్ధన్ మెహతా చెప్పారు.
పరిశోధన పరంగా అక్రమాలు చోటు చేసుకోవడం ఇతర దేశాలలో కాకుండా ఇండియాలోనే సర్వసాధారణమని చెప్పేందుకు ఆధారమేదీ లేదని సైన్స్ విధాన నిర్ణేతలు, ఎస్ఎస్ వి సభ్యులు అంటున్నారు. అయితే, చాలా దేశాలలో ఇటువంటి వ్యవహారాలపై చర్య తీసుకునేందుకు నియత యంత్రాంగాలు ఉన్నాయని ఎస్ఎస్ వి అధ్యక్షుడు చోప్రా తెలియజేశారు. కాగా, 'ఎస్ఎస్ వికి సదుద్దేశాలు ఉన్నాయి కాని అది చేవలేని సంస్థ కదా' అని మెహతా పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 9 September, 2009
|