జగన్ కాకపోతే రోశయ్యే! జగన్ కు సీఎం పదవిని కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించే పక్షంలో - తమ అభ్యర్థిగా రోశయ్యనే జగన్ వర్గం ఆమోదించే అవకాశం కూడా లేకపోలేదు. అనారోగ్యంతో బాధ పడుతున్న రోశయ్యను ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పించి... శాసనమండలికి గత ఎన్నికల సమయంలో వైఎస్ నామినేట్ చేశారు. తొలి నుంచి వైఎస్ తో రోశయ్యకు సత్సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు సౌమ్యుడైన రోశయ్యకు తనకంటూ ప్రత్యేక వర్గం లేదు. కాంగ్రెస్ లో ఎన్ జీ రంగా శిష్యునిగా అనేక వర్గాల మధ్య పోరును చూసిన రోశయ్యకు కాంగ్రెస్ లో వర్గ స్వభావాలు, అధిష్టానం మనోగతం కొట్టినపిండి.
కాంగ్రెస్ లోని వర్గాలతో సర్దుకుపోయే స్వభావం దృష్ట్యా రోశయ్యకు - వైఎస్ వర్గంతో కలిసి సాగడం పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. వైఎస్ వర్గం ప్రయోజనాలు కూడా ఆయనకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో జగన్ ను సీఎం చేయడం కుదరని పక్షంలో వైఎస్ వర్గం - రోశయ్యకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పరిశీలక వర్గాలు భావిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 12 September, 2009
|