అమ్మో! హెలికాప్టర్!
'షిల్లాంగ్ కు నేరుగా విమాన సర్వీసు ఉందేమోనని మంత్రులు వాకబు చేశారు. కాని ఢిల్లీ నుంచి షిల్లాంగ్ కు సరాసరి విమాన సర్వీసు లేదు' ఆ అధికారి చెప్పారు. 'మరొక మార్గమేమంటే ముందు కోలకతాకు, అక్కడి నుంచి షిల్లాంగ్ కు విమానంలో వెళ్ళడం. కాని, మేఘాలయలో భారీగా వర్షాలు పడుతున్నట్లు వార్తలు రావడంతో మంత్రులు వెనుకాడారు. అక్కడికి గగన ప్రయాణం చేయడం క్షేమం కాదని వారు భావించారు' అని ఆయన వివరించారు.
ఇది ఇలా ఉండగా, తమ ప్రాంతానికి గగన ప్రయాణం 'అత్యంత క్షేమకరమైనది' అని బారాపాని విమానాశ్రయం అధికారి ఒకరు చెప్పారు. 'గగన ప్రయాణం సమస్యేమీ కాదు. ఇక్కడ అంతా మామూలుగా ఉన్నది' అని ఆయన పేర్కొన్నారు. మూడు ఎయిర్ ఇండియా విమానాలు ప్రతి వారం మంగళ, గురు, శనివారాలలో బారాపానిలో దిగుతాయి. ఒక్కొక్క విమానంలో 20 మంది నుంచి 25 మంది వరకు ఉంటారు. 'ఇక్కడ కుండపోతగా వర్షం కురుస్తున్నప్పటికీ ఇంత వరకు ఒక్క విమాన సర్వీసును కూడా రద్దు చేయలేదు. అయితే, భారీ వర్షాల గురించిన వార్తల కారణంగా కేంద్రం పునరాలోచనలో పడి ఉండవచ్చు' అని విమానశ్రయం అధికారి పేర్కొన్నారు.
కాగా, మంత్రులు ఇతర కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటారు కనుక ఈ మహాసభను రద్దు చేయడమైనదని అధికారులు వివరించారు. 'సాంఘిక రంగ శాఖల మంత్రులు అందరూ హాజరు కాలేనప్పుడు మహాసభను నిర్వహించడంలో అర్థం లేదు. తరువాత అంతా సవ్యంగా ఉన్నప్పుడు మేము ఈ సభను నిర్వహిస్తాం' అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు.
ఏడాదికి రెండు సార్లు నిర్వహించే ఈ మహాసభకు గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, సాధికారత, మహిళా, శిశు సంక్షేమ, కార్మిక, గృహనిర్మాణ, పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రులు సాధారణంగా హాజరవుతుంటారు. ఇంతకుముందు ఢిల్లీలో ఈ సభ జరిగింది. శ్రీనగర్ తదుపరి సభా వేదిక కావచ్చు.
Pages: -1- 2 News Posted: 12 September, 2009
|