తక్కువ ఫీజుకే విదేశీ విద్య ముంబయి : విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలన్న భారతీయ విద్యార్థుల కోరిక త్వరలో ఇక్కడే తీరే వీలుంది. విదేశాల్లోని యూనివర్శిటీల్లో విద్యాభ్యాసం ఖరీదుగా మారిన నేపథ్యంలో... అమెరికా, బ్రిటన్ కు చెందిన విశ్వవిద్యాలయాలు భారత్ లోని నగరాల్లోనే తమ క్యాంపస్ లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే - ఈ విశ్వవిద్యాలయాల్లో ఫీజులు తక్కువగానే ఉంటాయని మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ అంటున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ, ఇంపీరియల్ కాలేజీలు భారత్ లో అడుగిడాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. నవంబర్ లో జరిగే పార్లమెంట్ సమావేశంలో 'విదేశీ విద్యా సౌకర్యాల బిల్లు'ను ప్రవేశపెడుతుందని చెప్పారు. భారతీయ విద్యాసంస్థల ఆమోదం, నాణ్యతలను పరిశీలించిన విధంగానే విదేశీ వర్శిటీలకు కూడా రేటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
Pages: 1 -2- News Posted: 12 September, 2009
|