తక్కువ ఫీజుకే విదేశీ విద్య ఇప్పటికే హార్వర్డ్, ఏల్, స్టాన్ పోర్డ్, పర్ద్యూ, కార్నెగే మెలేన్ యూని వర్శిటీలకు చెందిన ప్రతినిధి బృందాలు కొన్నేళ్ళుగా భారత్ ను సందర్శిస్తున్నాయి. తాజాగా ఇంపీరియల్ కళాశాలలకు చెందిన బృందం కేంద్ర మంత్రి సిబాల్ తో భేటీ అయింది. అనంతరం మహారాష్ట్రను కూడా ఈ బృందం సందర్శించింది. కొన్ని యూనివర్శిటీలు భారత్ లో తమకు అవసరైన ఏర్పాటు చేసుకుంటున్నాయి. జార్జియా టెక్ యూనివర్శిటీ హైదరాబాద్ లో క్యాంపస్ ఏర్పాటుకు స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు భారతీయ విద్యార్థులు అధికంగా అమెరికా, ఆస్ట్రేలియా లోని విశ్వవిద్యాలయాల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అంచనా ప్రకారం అమెరికాలో 1,04, 522, ఆస్ట్రేలియాలో 97, 035, బ్రిటన్ లో 25, 905 మంది భారతీయులు విద్యాభ్యాసం చేస్తున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు భారతీయ నగరాల్లో ఏర్పాటైతే భారతీయ విద్యార్థులకు చౌకగా విదేశీ విద్య లభిస్తుందనటంలో సందేహం లేదు.
Pages: -1- 2 News Posted: 12 September, 2009
|