కొండ ప్రాంత వైద్యానికి ఊపు న్యూఢిల్లీ : బౌద్ధ మత సిద్ధాంతంలో మూలాలు ఉన్న, హిమాలయ పర్వత ప్రాంతాలలో విస్తృతంగా అనుసరిస్తున్న ఒక ప్రాచీన వైద్య విధానానికి త్వరలోనే దేశంలో లాంఛనంగా గుర్తింపు లభించవచ్చు. దీని వల్ల ఇతర సాంప్రదాయక వైద్య విధానాలతో సమాన ప్రతిపత్తి దీనికి సమకూరుతుంది. గుర్తింపు ఉన్న మూడు సాంప్రదాయక వైద్య విధానాలు - ఆయుర్వేద, యునాని, సిద్ధతో జత కలుపుతూ సోవా-రిగ్పా వైద్య విధానానికి 1970 నాటి చట్టం సవరణ ద్వారా గుర్తింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సాంప్రదాయక వైద్య విధానాలను ఈ చట్టం నియంత్రిస్తుంది.
సోవా-రిగ్పా వైద్య విధానానికి చట్టపరమైన గుర్తింపు లభించడం వల్ల దీనిని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికి వీలు కలుగుతుందని, లడఖ్ నుంచి డార్జిలింగ్ వరకు, సిక్కిం నుంచి అరుణాచల ప్రదేశ్ వరకు హిమాలయ పర్వత ప్రాంతాలలో ఈ వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలియజేశారు.
కాగా, 'మేము ఈ గుర్తింపు కోసం అనేక సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాం' అని డార్జిలింగ్ లో సోవా-రిగ్పా వైద్యం చేసే లాబ్సంగ్ తుప్టెన్ చెప్పారు. 'దీనికి లాంఛనంగా గుర్తింపు లభించడం వల్ల మరింత మందికి చికిత్స చేసేందుకు మాకు వీలు కలుగుతుంది' అని తుప్టెన్ చెప్పారు. ఆయన హిమాచల ప్రదేశ్ లోని ధర్మశాలలో ఒక టిబెటన్ వైద్య సంస్థలో ఐదు సంవత్సరాల పాటు చదివి, డార్జిలింగ్ లో క్లినిక్ లో చేరడానికి ముందు ఒక సంవత్సరం పాటు ఇంటర్న్ షిప్ పూర్తి చేశారు.
Pages: 1 -2- News Posted: 14 September, 2009
|