కొండ ప్రాంత వైద్యానికి ఊపు
దేశంలో సోవా-రిగ్పా వైద్యం చేసేవారిని ఆమ్చీలుగా పేర్కొంటారు. వారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 55 చిన్న క్లినిక్ ల నెట్ వర్క్ ద్వారా సేవలు అందిస్తున్నారు. 'చాలా కాలంగా పీడిస్తున్న అస్వస్థలతో సహా అన్ని రకాల రుగ్మతలతో రోగులు మా వద్దకు వస్తుంటారు' అని తుప్టెన్ తెలియజేశారు.
'ప్రధానంగా ఎక్కువ ఎత్తైన ప్రదేశాలలో దొరికే కొన్ని మొక్కలతో సహా మూలికలతో ఈ విధానం కింద వైద్య చికిత్స చేస్తారు. దీనికి ఆయుర్వేదంతో దగ్గర పోలికలు ఉన్నాయి' అని ఆరోగ్య మంత్రిత్వశాఖ సలహాదారు సురీందర్ శర్మ చెప్పారు. ఈ వైద్య విధానం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం గ్రహించిందనేందుకు సూచికే మంత్రివర్గ ఆమోదముద్ర అని ఆయన పేర్కొన్నారు. 'దేశీయ వైద్య విధానాలలో ఇది నాలుగవ ప్రక్రియ కాగలదు' అని శర్మ చెప్పారు.
సోవా-రిగ్పాకు సంబంధించిన ప్రాథమిక పాఠ్యగ్రంథం 'రగ్యుద్ బుజీ' గా పేర్కొనే శతాబ్దాల నాటి చికిత్సా గ్రంథం. బౌద్ధ మత సిద్ధాంతంతో దీనికి సన్నిహిత అనుబంధం ఉంది. ఈ వైద్య విధానాన్ని లాంఛనంగా గుర్తించడం వల్ల సోవా-రిగ్పాలో ఫార్మకాలాజికల్ మార్గదర్శక సూత్రాల అభివృద్ధి దిశగా వైద్య విద్య, వైద్య పద్ధతులు, పరిశోధనను ప్రామాణికం చేయడానికి ప్రభుత్వానికి వీలు కలుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. 'సోవా రిగ్పాలో ముఖ్యమైన మొక్కలపై దృష్టిని మేము కేంద్రీకరించగలం' అని సాంప్రదాయక వైద్య విధానాలకు సంబంధించిన మొక్కలు సరఫరా చేసే ఒక సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిక్రమ్ సింగ్ సజ్వాన్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 14 September, 2009
|