షాక్ ఇచ్చిన సింఘ్వి రోశయ్య ఆర్థిక శాఖలోని తన చాంబర్ నుండే ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించడం గురించి ప్రస్తావించగా ఆయన ఎక్కడ కూర్చుంటే ఏమిటి? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రే, సిఎం బాధ్యతలను ఎక్కడినుంచైనా నిర్వహించవచ్చు కదా? అని ఎదురు ప్రశ్నవేశారు. మీరు ప్రతి అంశాన్ని సంచలనాత్మకం చేస్తున్నారు అని ఆయన మీడియాను తప్పుపట్టారు. జగన్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని మెజారిటీ శాసనసభ్యులు, ప్రజలు కోరుకుంటున్నారు కదా? అని అడగ్గా రాజశేఖరరెడ్డి వారసుడిని కాంగ్రెస్ పద్ధతిలోనే ఎంపిక చేస్తాము తప్ప ఇంకో రకంగా కాదని ఆయన స్పష్టం చేశారు. కొత్త నాయకుడిని ఎంపికచేసే ప్రక్రియ ప్రారంభమైంది, అది పూర్తయిన తరువాతనే కొత్త నాయకుడిని నియమించడం జరుగుతుందన్నారు.
రాజశేఖరరెడ్డి వారసుడిని ఎప్పటిలోగా ఎంపిక చేస్తారనే దానికి అభిషేక్ సింఘ్వి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. సీఎల్పీ నాయకుడుగా ఎంపిక కాని రోశయ్య దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయవచ్చా, సమావేశాలకు హాజరు కావచ్చా? అని ప్రశ్నించగా ఎందుకు చేయకూడదు? ముఖ్యమంత్రిగా శాసనసభ సమావేశాలకు రోశయ్య హాజరుకావచ్చునని అభిషేకం సింఘ్వి అభిప్రాయపడ్డారు.
Pages: -1- 2 News Posted: 15 September, 2009
|