ఇదేమి పొదుపు? వాషింగ్టన్ : తన 14 సీట్ల ఎంబ్రేర్ వివిఐపి స్క్వాడ్రన్ విమానం వినియోగానికి స్వస్తి చెప్పాలన్న విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం. కృష్ణ నిర్ణయం వల్ల సౌత్ బ్లాక్ పొదుపు చర్యల వల్ల ఆదా చేసిన సొమ్ము కన్నా అధికంగా ప్రభుత్వానికి ఖర్చవుతుంది. దుర్భిక్షం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలను ఇది అపహాస్యం చేసినట్లు కాగలదు.
బెలారుస్, తుర్క్ మెనిస్తాన్ దేశాలకు మంత్రి ప్రతినిధిబృందాన్ని కుదిస్తూ, మిన్స్క్, అష్గబాత్ లకు కమర్షియల్ విమాన సర్వీసులలో ఎకానమీ క్లాస్ లో ఆయన సీటు బుక్ చేయడానికి విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికారులు సోమవారం నానా ప్రయాస పడ్డారు. కృష్ణ ఈ పర్యటనకు తన ఎంబ్రేర్ విమానాన్ని ఉపయోగించరు కనుక ఎంఇఎ ట్రావెల్ ఏజెన్సీ, ప్రభుత్వ రంగంలోని బామర్ లారీ కంపెనీ ఆయనకు, ఆయన సహాయకులకు ఫ్రాంక్ ఫర్ట్ కు ఒక కమర్షియల్ విమానంలో సీట్లు రిజర్వ్ చేసింది. ఈ మార్గం ఇంకా మారిపోయినా మారిపోవచ్చునని అధికారులు 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో అన్నారు.
ఈ పొదుపు చర్యల గురించి కాకపోతే కృష్ణకు అసలు ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్ళవలసిన అగత్యమే లేదు. మంత్రికి, ఆయన పరివారానికి సీట్ల కోసం జర్మన్ విమాన సంస్థ లుఫ్తాన్సాకు డబ్బులు చెల్లించవలసిన పనే లేదు. వారు టెహ్రాన్ లో గాని, బాకులో గాని తిరిగి ఇంధనం నింపడం కోసం ఆగి నేరుగూ మిన్స్క్ కు ఎంబ్రేర్ విమానంలో వెళ్ళి ఉండేవారని వివిఐపి స్క్వాడ్రన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పడు కృష్ణ, ఆయన అధికారులు ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మిన్స్క్ కు కనెక్టింగ్ విమానంలో వెళతారు. అంటే అవసరమైనదాని కన్నా ఎక్కువ సమయమే వారు గగనవిహారం చేస్తారన్నమాట. ఆ సమయాన్ని దేశ వ్యవహారాలను చక్కబెట్టడానికి ఉపయోగించి ఉండవచ్చు.
కనెక్టింగ్ విమాన సర్వీసులు అంతగా లేని మార్గం మిన్స్క్ నుంచి అష్గబాత్ వరకు మంత్రికి విమాన టిక్కెట్లు రిజర్వ్ చేయడం కోసం ఎంఇఎ ట్రావెల్ ఏజెంట్లు ఎంతో ప్రయాస పడ్డారు. కనెక్టింగ్ విమానాలు ఎక్కువగా ఉన్న మార్గంలో అంటే మిన్స్క్ నుంచి మాస్కోకు, ఆ తరువాత మాస్కో నుంచి అష్గబాత్ కు వెళ్ళడం ఒక పద్ధతి. అయితే, మాస్కో - అష్గబాత్ మార్గంలో విమాన ప్రయాణం ఆధారపడదగినది కాదని సాధారణ అభిప్రాయం.
Pages: 1 -2- News Posted: 15 September, 2009
|