ఇదేమి పొదుపు?
చివరకు మిన్స్క్ నుంచి అష్గబాత్ కు ఒక విమాన సర్వీసు లభ్యమైంది. కాని ఆ మార్గంలో విమాన సంస్థల రికార్డును పరిగణనలోకి తీసుకుంటే ఈ విమానం ఆలస్యమైనా కావచ్చు లేదా రద్దయినా కావచ్చు. దీనితో ప్రభుత్వం మరొక 'చుట్టూ తిరిగి మాచారం'లా మరొక మార్గంలో మంత్రి కోసం విమాన సర్వీసును ఎంచుకోవడం లేదా ఒక విదేశీ నగరంలో ఒక రాత్రి కోసం ఖరీదైన హోటల్ లో వసతి కోసం డబ్బు చెల్లించడం చేయవలసి ఉంటుంది. అయితే, ఏ భారత రాయబారి అయినా తన మంత్రి కోసం చౌక అయిన ఒక మోటల్ ను బుక్ చేసి న్యూఢిల్లీలో పొదుపు కార్యక్రమం వల్ల మంచి హోటళ్ళలో రిజర్వ్ చేయలేకపోయామని ఆయనతో చెప్పలేకపోవచ్చు.
ఇతర మంత్రిత్వశాఖలలో ఖర్చును తగ్గించడంలో హేతుబద్ధత ఏదైనా ఉండి ఉండవచ్చు కాని బాహ్య ప్రపంచంతో వ్యవహారాలు సాగించవలసి ఉన్న విదేశాంగ శాఖ (సౌత్ బ్లాక్)లో ఇటువంటి చర్యలు సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తజికిస్తాన్ లో పర్యటన అనంతరం ఇప్పుడే తిరిగి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధ పరిస్థితి రానున్న కాలంలో మరింత సంక్లిష్ట రూపు సంతరించుకున్నప్పుడు మాత్రమే ఇండియాకు వ్యూహపరంగా ప్రాముఖ్యం పెరిగే దేశం తజికిస్తాన్. అంటే, కృష్ణ సాధ్యమైనంత త్వరలో తజికిస్తాన్ ను సందర్శించవలసి ఉంటుందన్నమాట. ఇతరుల దృష్టిలో విలాస చిహ్నమైన ఆయన ప్రైవేట్ ఎంబ్రేర్ జెట్ విమానంలో ఆయన తక్కువ సమయంలో న్యూఢిల్లీ నుంచి దుషాంబెకు వెళ్ళి ఉండవచ్చు. కాని ఈ పొదుపు చర్యల కారణంగా ఆయన న్యూఢిల్లీ నుంచి దుబాయికి, అక్కడి నుంచి మాస్కోకు, తిరిగి అక్కడి నుంచి దుషాంబెకు అంటే మూడు వేర్వేరు కమర్షయల్ విమాన సర్వీసులలో వెళతారన్నమాట. ఎందుకంటే తజికిస్తాన్ కు ఇదే అత్యంత విశ్వసనీయమైన వాణిజ్య ప్రయాణ మార్గం.
దుర్భిక్ష పీడిత ప్రజల పేరు మీద పొదుపు కోసం భారత ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అభివర్ణించడానికే బహుశా 'లోభికి ఖర్చెక్కువ' అనే సామెత వచ్చి ఉంటుంది. కృష్ణ అధికార నివాస భవనం సిద్ధమయ్యేంత వరకు ఫారెన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో ఆయన బసపై ప్రభుత్వం పన్నులు చెల్లించే ప్రజల డబ్బును ఎంత ఖర్చు పెట్టనున్నదో ఎంఇఎ అధికారి ఒకరు లెక్క కట్టారు. మౌర్య షెరాటన్ హోటల్ లో నివాస వసతి విభాగంలో మంత్రి బస చేసినప్పుడు ఆయన లాడ్జింగ్ పై సౌత్ బ్లాక్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఆయన అల్లుని కంపెనీయే ఆయన బస ఖర్చును భరించింది.
విదేశాలకు తన పరివారాన్ని ముగ్గురికి కుదించాలన్న కృష్ణ నిర్ణయం కూడా ఆర్థికంగా అర్థవంతంగా లేదు. ప్రస్తుత పొదుపు చర్యల పథకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వ అధికారులు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తుంది. చాలా దేశాలలో ఆతిథేయ ప్రభుత్వాలు తమ దేశానికి వచ్చే ప్రతినిధి వర్గాలకు లేదా వారిలో కొందరికి వసతి ఏర్పాట్లు చూస్తాయి. ఉదాహరణకు తజికిస్తాన్ తో గల సన్నిహిత మైత్రికి చిహ్నంగా ఈమధ్య భారత ప్రతినిధివర్గానికి దుషాంబెలో సువిశాలమైన అధ్యక్ష భవనంలోనే బస ఏర్పాటు చేశారు. వారిపై ప్రభుత్వానికి అయిన ఖర్చు నామమాత్రమే.
Pages: -1- 2 News Posted: 15 September, 2009
|