కులాలతో జనాభా గణన! తాజాగా కులాల సమాచారాన్ని కూడా జనాభా గణనలో చేరిస్తే వివాదం తలెత్తే అవకాశం ఉంది. కులాల లెక్కింపు సమాజంలో మరిన్ని చీలికలకు దారి తీస్తుందనే వాదన ఉంది. అయితే ఇన్ని దశాబ్దాలుగా కులం సమాచారం లేకుండా జనాభా గణన చేసినా కూడా కులం ప్రాధాన్యత తగ్గని విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయమై న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ ప్రస్తావిస్తూ, కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీ, ముస్లింలపై చేసిన సర్వేలు ప్రభుత్వ లక్ష్యాల సాధనకు తోడ్పడ్డాయన్నారు. ఉన్నత విద్యతో ఓబీసీ కోటా గురించి సుప్రీం కోర్టులో విచారణ సమయంలో ప్రస్తావనకు వచ్చింది. ఓబీసీ గణాంకాలు లేకుండా సామాజిక న్యాయశాఖ నిధులెలా కేటాయిస్తోందని 14వ లోక్ సభలో పార్లమెంటరీ సంఘం ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో జనాభా గణనలో కులాన్ని జోడించాలని న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వం కులం సమాచారంతో జనాభాను లెక్కిస్తే - అది కాంగ్రెస్ వైఖరికి విరుద్ధం అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే - కులాల వారీగా జనాభా లెక్కింపునకు ప్రాధమికంగా కాంగ్రెస్ వ్యతిరేకమని వీరప్ప మొయిలీ తెలిపారు. బహుశా - కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని తీసుకునే నిర్ణయం తేటతెల్లం చేస్తుంది.
Pages: -1- 2 News Posted: 15 September, 2009
|