మమత రంగుల రైలు!
'వేగాన్ని రంగుల గీతల ద్వారా సూచించడమైనది. అయితే, మామూలు మనుషులకు ఈ పెయింట్ వర్క్ ఎవరో చిన్నపిల్లవాడి పిచ్చిగీతలుగా కనిపించవచ్చు' అని ఒక చిత్రకారుడు పేర్కొన్నారు. ఆయన తన పేరు వెల్లడి చేయరాదనే షరతు పెట్టారు. అంటే ఈ పెయింటింగ్ ల విషయంలో ఇంకా మెరుగుదల ఉండాలన్న మాట. అయితే, చిన్నపిల్లవాడి గీతలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.
డ్యురోంటో రైలులో పెయింటింగ్ పనిని తూర్పు రైల్వే ఒక టెండర్ ద్వారా ఒక ఏజెన్సీకి అప్పగించింది. 'ఆ ఏజెన్సీ పలు డిజైన్లు సిద్ధం చేసింది. వాటిని ఆమోదముద్ర కోసం రైల్వే బోర్డుకు పంపాం. బోర్డు ఈ డిజైన్ ను ఆమోదించింది' అని రైల్వే అధికారి తెలిపారు. అయితే, వాస్తవానికి ఈ డిజైన్ ను మమత ఆమోదించారని, ఆతరువాతే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఈ పెయింటింగ్ ను అల్ట్రా వయొలెట్ పద్ధతిని ఉపయోగించి కాస్ట్ పోలీమెరిక్ వినైల్ (సిపివి) పై డిజిటల్ గా ఎంబాస్ చేశారు. (సిపివి చక్కగా అతుక్కోగల ఒక రకమైన ఫిలిమ్). 18 బోగీలకు వెలుపలి భాగంలో పెయింటెడ్ ఫిలిమ్ లు అంటించడానికి ఏజెన్సీకి ఎనిమిది రోజుల వ్యవధి పట్టింది. '18 బోగీలలో 16 బోగీలను డ్యురోంటో కోసం ఉపయోగిస్తున్నారు. రైలు కోసం 16 బోగీలను ఉపయోగించనున్నప్పటికీ 25 బోగీలకు మేము పెయింటింగ్ వేయిస్తాం' అని రైల్వే అధికారి తెలియజేశారు. 'బోగీల లోపల గోడలపైన మధుబని పెయింటింగ్ లతో సహా సాంప్రదాయక చిత్రాలను వేయించాం' అని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి డ్యురోంటో రైలుకు మాత్రమే పెయింటింగ్ లు ఉంటాయి. 'ఇతర రైళ్ళ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది' అని ఆ అధికారి చెప్పారు.
ఇది ఇలా ఉండగా, పేరు డ్యురోంటో అయినప్పటికీ దీని తొలి ప్రయాణంలోనే మధ్యలో ఒక అవరోధం ఎదురైంది. ఒక గాలిపటం దారం రైలు ఇంజన్ పాంటోగ్రాఫ్ కు చుట్టుకుపోవడంతో రైలు అగిపోవలసి వచ్చింది. రైలును ప్రయాణంలో ధన్ బాద్ ను మొదటి స్టాప్ గా నిర్ణయించినప్పటికీ సాయంత్రం 5.46 నుంచి 6.17 వరకు డాంకుని స్టేషన్ లో ఇది నిలచిపోవలసి వచ్చింది. 'ఇది చాలా చిన్న సంఘటన. రాజధాని ఎక్స్ ప్రెస్ తో సహా అన్ని దూర ప్రాంత రైళ్ళ విషయంలో ఇది జరుగుతుంటుంది' అని మమత వ్యాఖ్యానించారు.
రైలుకు ఏ రంగైనా వేయవచ్చునని, కాని రైలంటే రైలేనని ఈ ఉదంతం సూచిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 19 September, 2009
|