సైంటిస్టుల బురద బాంబులు
11 ఏళ్ళ తరువాత మేల్కొన్న 'రిప్ వాన్ వింకిల్' వంటి వాడిని తాను కానని సంతానం స్పష్టం చేశారు. ఆయన 1998 మే నాటి అణ్వస్త్రపాటవ పరీక్షలను జయప్రదమైనవిగా ప్రకటించినప్పుడు అణు శక్తి, రక్షణ పరిశోధన విభాగం ఉన్నతాధికారుల వెంట ఉన్నారు. హైడ్రోజన్ బాంబు పరీక్ష గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ 1998 చివర్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డీఓ) సమర్పించిన 50 పేజీల డాక్యుమెంట్ ను ప్రభుత్వం, అణుశక్తి విభాగం నిర్లక్ష్యం చేస్తున్నాయని సంతానం ఆరోపించారు. 'నేను స్థిరాభిప్రాయానికి వచ్చాను. వాస్తవాలతో గందరగోళం సృష్టించకు అనే దృక్పథంతో ఉన్నట్లు ఉన్నది' అని ఆయన పేర్కొన్నారు. 'ఇది మతపరమైన పిడివాదం వంటింది. ఇటువంటి ప్రక్రియ లేకుండా సైన్స్ పురోగమించదు' అని సంతానం అన్నారు.
హైడ్రజన్ బాంబుల టెక్నాలజీని లోపరహితంగా చేయడానికి ఇండియా థర్మోన్యూక్లియర్ ఆయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని, సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ సంధి (సిటిబిటి)పై సంతకం చేయాలనే ఒత్తిడిని నిలువరించాలని సంతానం, ఇతర వ్యూహ నిపుణులు సూచిస్తున్నారు. ఒక వైపు ఈ చర్చ సాగుతుండగా మరొకవైపు ప్రభుత్వంలో కొన్ని వర్గాల అభిప్రాయాలను, సిటిబిటికి ఇండియా సమ్మతించరాదని కోరుకుంటున్న అణ్వస్త్ర విభాగం అధికారుల అభిప్రాయాలను సంతానం ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారేమోనని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
అయితే, భాభా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో అణ్వస్త్ర విభాగం మాజీ అధిపతి ఒకరు సంతానం వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నారు. ఆ ప్రదేశంలో ఇన్ స్ట్రుమెంట్ రీడింగ్ లు, రేడియో ధార్మిక శక్తి స్థాయి, ఇతర దాఖలాలు ఆ పరీక్షలు విజయవంతమయ్యాయని 'స్పష్టంగా సూచిస్తున్నాయి' అని ఆ సైంటిస్ట్ సతీందర్ సిక్కా తెలియజేశారు. 'షాఫ్ట్ దెబ్బ తిన్నది' అని సిక్కా తెలిపారు. 'ట్రాంబేలోని పరిశోధకులు ఆ పేలుళ్ళను కృత్రిమ పరిస్థితులలో నిర్వహించి అప్పటి ఫలితాలనే తిరిగి సాధించారు' అని సిక్కా 'ది టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరితో చెప్పారు.
కాని థర్మోన్యూక్లియర్ ఆయుధ పరీక్ష విజయవంతమైనదని ప్రకటించేందుకు బార్క్ ఏదో కొంత డేటాను మాత్రమే ఉపయోగించిందని సంతానం ఆరోపించారు. 'బార్క్ విశ్లేషణలో ఏ డేటాను చేర్చారు, దేనిని చేర్చలేదు అనేదే సమస్య' అని సంతానం పేర్కొన్నారు. సిక్కా తన మాజీ బాస్ ల వద్ద, తన (సంతానం) వద్ద, ద్వైపాక్షిక వైజ్ఞానిక చర్చలలోను ఈ వైఫల్యం గురించి అంగీకరించారని, కాని అణు ఇంధన సంస్థ (ఎఇసి) మాజీ చైర్మన్ ఆర్. చిదంబరం ఆయన నోరు నొక్కివేశారని సంతానం చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 22 September, 2009
|