సైంటిస్టుల బురద బాంబులు
అయితే, సిక్కా ఈ వాదనను ఖండించారు. 'ఇది పూర్తిగా అసత్యం' అని సిక్కా పేర్కొన్నారు. 'ఆయన (సంతానం) ఇంత హీన స్థాయికి దిగజారుతారని నాకు తెలియదు' అని సిక్కా చెప్పారు. పోఖ్రాన్ పరీక్షలకు సంబంధించిన ఇన్ స్ట్రుమెంటేషన్ తో గాని, ఫిజిక్స్ తో గాని సంతానానికి ఏవిధంగాను ప్రమేయం లేదని సిక్కా స్పష్టం చేశారు.
జాతీయ భద్రతా విషయాల సలహాదారుడు (ఎన్ఎస్ఎ) ఎం.కె. నారాయణన్ ఒక టెలివిజన్ చానెల్ విలేఖరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కూడా సంతానం సవాల్ చేశారు. 'తాను (సంతానం) దేని గురించి మాట్లాడుతున్నదీ సంతానానికి ఏమీ తెలియదు' అని నారాయణన్ అన్నారు. 'నాకు తెలుసు. అవతలివారికే అసలేమీ తెలియదు' అని సంతానం సోమవారం పేర్కొన్నారు. ఇండియాకు 'థర్మోన్యూక్లియర్ సామర్థ్యం ఉందన్న నారాయణన్ ప్రకటనను ఒక కిలోటన్ను ఉప్పుతో కలిపి తీసుకోవాలని సంతానం అన్నారు.
డిఆర్డీఓ డాక్యుమెంట్ కు బార్క్ 100 పేజీల ఖండన ప్రకటనను వెలువరించిందని సిక్కా తెలియజేశారు. రెండు పత్రాలపైన 1998-99లో జాతీయ భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో చర్చించారని సిక్కా తెలిపారు.
ఆ పరీక్షలకు సంబంధించిన డేటానంతనూ స్క్రూటినీ, సిఫార్సుల నిమిత్తం సైంటిస్టులతో కూడిన స్వతంత్ర బృందానికి అందజేయాలని, ఆయుధాల విజ్ఞాన శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసిన రిటైరైన మాజీ న్యూక్లియర్ సైంటిస్టులు అందులో సభ్యులుగా ఉండాలని సంతానం సూచించారు. ప్రభుత్వం తదుపరి కార్యాచరణను నిర్ణయించాలని ఆయన కోరారు. అటువంటి నివేదికను రహస్య పత్రంగా వర్గీకరించాలని, ఎంపిక చేసిన భాగాలను మాత్రమే బహిర్గతం చేయాలని సంతానం సూచించారు.
Pages: -1- -2- 3 News Posted: 22 September, 2009
|