రోశయ్య సొంత కేబినెట్!
అలాగే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పూర్తిగా సహాకరిస్తూ, పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి ఉన్న మంత్రులను యధావిధిగా మంత్రి వర్గంలో కొనసాగించాలనే నిర్ణయానికి రోశయ్య వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తన మాటకు కట్టుబడి, విధేయులైన మంత్రులు ఉంటేనే పాలన సవ్యంగా కొనసాగే అవకాశాలుంటాయని, లేకపోతే పాలనా పరంగా అనేక సమస్యలు రావచ్చని రోశయ్య భావిస్తున్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క్‌ను కూడా ఆ పదవి నుంచి తప్పించి ఏదో ఒక కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు రోశయ్య సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. భట్టి స్థానంలో కర్నూలు ఎమ్మెల్యే టి.జి. వెంకటేశ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించే అవకాశా లున్నాయనే వాదనలు బలంగా వస్తున్నాయి. మంత్రి వర్గంలో మార్పులకు సంబంధించి రోశయ్య ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి హైకమాండ్‌కు అందజేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ముఖ్యమంత్రి పేషీలో కూడా సమర్ధులైన అధికారుల కోసం రోశయ్య అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యం హెలికాప్టర్ దుర్గటనలో వైఎస్‌తో పాటే చనిపోవడం, మరో ప్రత్యేక కార్యదర్శి భాను ఎక్స్‌టెన్షన్ కాలం ముగియడం, పేషీ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి రిటైర్డ్ కావడంతో భారమంతా ముఖ్యకార్యదర్శి జన్నత్ హుస్సేన్‌పై పడింది. ఆయన కూడా తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని రోశయ్యకు విన్న వించినట్లు సమాచారం. దీంతో ప్రత్యమ్నాయంగా అధికారులను నియమించుకునేందుకు రోశయ్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కె.వి. రమణా చారి, సివిఎస్‌కె శర్మ తదితరుల పేర్లు సీఎం పేషీ కోసం రోశయ్య పరిశీలనలో ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచా రాన్ని బట్టి తెలుస్తోంది. ఇక మంత్రి వర్గంలో మార్పులు ఈ విధంగా ఉండవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
పునర్వ్యవస్థీకరించబోతున్న రోశయ్య మంత్రివర్గంలో పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్న మంత్రుల పేర్లు:
కొండా సురేఖ (వరంగల్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్గొండ), డొక్క మాణిక్య వరప్రసాద్ (గుంటూరు), పితాని సత్యనారాయణ (పశ్చిమగోదావరి), వట్టి వసంత కుమార్ (పశ్చిమగోదావరి), విశ్వరూప్ (తూర్పు గోదా వరి), పిల్లి సుభాష్ చంద్రబోస్ (తూర్పు గోదావరి), రామ చంద్రారెడ్డి (చిత్తూరు), అహ్మదుల్లా (కడప), సబితా ఇంద్రారెడ్డి (రంగారెడ్డి), దానం నాగేందర్ (హైదరాబాద్), ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు), శిల్పా మోహన్‌రెడ్డి (కర్నూలు), రఘువీరారెడ్డి (అనంతపురం), బొత్సా సత్యనారాయణ (విజయనగరం), జూపల్లి కృష్ణారావు (మహబూబ్‌నగర్), డి.కె.అరుణ (మహబూబ్‌నగర్), బాల్‌రాజ్ (విశాఖ).
Pages: -1- 2 -3- News Posted: 1 October, 2009
|