సైంటిస్టుల కుటుంబం అది
1968లో నోబెల్ బహుమతి పొందిన భారతీయ అమెరికన్ హరగోవింద్ ఖొరానా యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ లో ఉన్నప్పుడే వైద్య శాస్త్రంలో నోబెల్ ను ఆయనకు ప్రదానం చేశారు.
సి.వి. రామకృష్ణన్ కెనడాలో ప్రతిష్ఠాకరమైన నేషనల్ రీసర్చ్ కౌన్సిల్ లో చేరారు. తన భర్త వెంట కెనడా వెళ్ళిన రాజ్యలక్ష్మి పిహెచ్ డి కోసం మెక్ గిల్ యూనివర్శిటీలో పేరు నమోదు చేయించుకున్నారు. రాజ్యలక్ష్మి, సి.వి. రామకృష్ణన్ పాశ్చాత్య దేశాలలో ఎటువంటి లోటూ లేకుండా జీవిస్తున్నప్పటికీ మాతృభూమిపై మమకారం బలంగా ఉంటుండేది. వాస్తవానికి ఇండియా నుంచి పాశ్చాత్య దేశాలకు మేధావుల వలస ఎక్కువగా ఉంటుండేది.
గుజరాత్ లో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ అయిన బరోడా విశ్వవిద్యాలయం 1955లో సి.వి. రామకృష్ణన్ ను ఆహ్వానించినప్పుడు ఆ దంపతులు ఉత్తర అమెరికాలో తమ కెరీర్ ను వదలుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. సి.వి. రామకృష్ణన్, రాజ్యలక్ష్మి కలసి బరోడా విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడమే కాకుండా మెదడు వికాసంలో పౌష్టికాహారానికి గల పాత్రపై తమ పరిశోధనాత్మక కృషికి ప్రపంచవ్యాప్త గుర్తింపును కూడా పొందారు. ఈ పరిశోధనాత్మక కృషి కోసం ఉదారంగా వచ్చిన గ్రాంట్లతో వారు రూపొందించిన సిద్ధాంతాలు ఆ సమయంలో పాశ్చాత్య దేశాలలో ప్రచారంలో ఉన్న సిద్ధాంతానికి భిన్నంగా ఉండి తృతీయ ప్రపంచ దేశాలలో మానవ వికాసానికి దోహదం చేశాయి.
వారి చిన్న కుమారుడు అప్పట్లో ఫిజిక్స్ లో స్పెషలైజ్ చేస్తున్నారు. ఆయన అప్పటికే ఫిజిక్స్ లో బరోడా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్ సి పట్టాను, ఓహియో విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ డి పట్టాను పొందారు. కాని బయాలజీ పట్ల, బయోకెమిస్ట్రీ పట్ల ఆ కుటుంబానికి గల అమిత అభిమానం చివరకు ఆయనను కూడా ఆవరించింది. వెంకట్రామన్ రామకృష్ణన్ యేల్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్-డాక్టరల్ ఫెలోగా చేరారు.
Pages: -1- 2 -3- News Posted: 8 October, 2009
|