సైంటిస్టుల కుటుంబం అది
అమెరికాలో ఆయనకు ఇటువంటి ఇతర ఆఫర్ లు కూడా వచ్చాయి. కాని వెంకట్రామన్ రామకృష్ణన్ ఇంగ్లండ్ కు తరలిపోవాలని నిశ్చయించుకున్నారు. అమెరికాలో లేని ఒక సౌలభ్యం ఆయనకు కేంబ్రిడ్జి ఆఫర్ ద్వారా కలగనున్నది. పరిశోధనకు గ్రాంట్ల కోసం నిరంతరం అభ్యర్థిస్తుండవలసి రావడం, నిధులు వస్తాయో లేదో తెలియకపోవడం వంటి అనిశ్చిత స్థితిని ఆయన అమెరికాలో ఎదుర్కొనవలసి వచ్చేది. మరొక వైపు తాను సాగించాలనుకున్న పరిశోధనకు అవకాశాలను ఆ భారతీయ అమెరికన్ కు కేంబ్రిడ్జి కల్పించింది. ఇప్పుడు ఆ పరిశోధనకే ఆయనకు నోబెల్ ప్రకటించారు.
రాజ్యలక్ష్మికి పక్షవాతం వచ్చినందున, తమ కుమార్తె, ప్రస్తుతం సియాటిల్ లోని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ లో మైక్రోబయాలజీ, మెడిసిన్ ప్రొఫెసర్ అయిన లలిత అస్వస్థురాలైన తల్లి వద్ద ఉండాలని కోరుకున్నందున తాను 1996లో అమెరికాకు నివాసాన్ని మార్చుకున్నట్లు సి.వి. రామకృష్ణన్ 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో చెప్పారు. ఆయన రిటైరై అప్పటికే చాలా కాలం అయింది. లలిత స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని.
ఇక బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు మొదటి కాల్ వచ్చిన తరువాత లలిత రామకృష్ణన్, ఆమె తండ్రి నివాసాలలో ఫోన్లు వరుసగా మోగుతూనే ఉన్నాయి. వారికి ఫోన్ చేసినవారిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ సుస్మితా గంగూలీ థామస్ కూడా ఉన్నారు. ఈ కాన్సుల్ పరిధిలోనే సియాటిల్ ఉంది.
కాగా, విలేఖరుల మాదిరిగా కాకుండా వెంకట్రామన్ రామకృష్ణన్ తన తండ్రిని నిద్రలో నుంచి లేపరాదని భావించి తెల్లవారు జామున 5 గంటల వరకు ఆయనకు ఫోన్ చేయలేదు. ఏమైనా ఆ కుటంబం మొత్తానికి ఇది చిరకాలం గుర్తుండిపోయే రోజు.
Pages: -1- -2- 3 News Posted: 8 October, 2009
|