'మా ఒబామాకే ఎందుకు?'
కాగా, ఈ ఎంపిక నోబెల్ కమిటీ విశ్వసనీయతకు, అవార్డు విశ్వసనీయతకు హాని కలిగించవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. 'రాజకీయ ముద్ర వేయడంగా తప్ప వాస్తవికంగా ఆలోచించినట్లు కనిపించడం లేదు' అని అని అట్లాంటాలో స్పెల్ మాన్ కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్ విలియమ్ జెలానీ కాబ్ పేర్కొన్నారు. ఒబామాపై ఒక గ్రంథాన్ని కాబ్ వెలువరించబోతున్నారు. 'గ్వాంటనామోను ఇంకా మూసివేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో సైనికుల సంఖ్యను పెంచడం ఆయనకు ఇప్పుడు కష్టం కాగలదు' అని క్యూబాలోని అమెరికా జైలు గురించి ప్రస్తావిస్తూ కాబ్ అన్నారు. విచారణ లేకుండా ఏళ్ళ తరబడి ఖైదీలు ఆ జైలులో మగ్గుతున్నారు.
ఇది అవార్డును రాజకీయమయం చేస్తున్నదని హూస్టన్ ప్రధాన కేంద్రంగా గల మదుపు సంస్థ సేలియంట్ పార్టనర్స్ డైరెక్టర్ హాగ్ షెర్మాన్ వ్యాఖ్యానించారు. 'వామపక్ష భావాలు గల అమెరికన్ నాయకులు ఎక్కువగా ఇటీవలి కాలంలో అవార్డును అందుకున్నారు. మితవాదులు దీనిని రాజకీయపరమైనదిగా భావిస్తారు' అని ఆయన అన్నారు. 'ప్రపంచంలో అమెరికా ఇంకా బలీయమైన శక్తి అని, అమెరికాతో సంబంధాలను ప్రపంచం కోరుకుంటున్నదని ఇది సూచిస్తున్నది' అని ఆయన పేర్కొన్నారు.
తాను ఆశ్చర్యచకితురాలినైనట్లు ఒపేరా గాయని 30 సంవత్సరాల కరిస్సా మార్చ్ చెప్పారు. అయితే, ఒబామా తాను ప్రారంభించిన కొన్ని పనులు పూర్తి విజయవంతంగా పూర్తి చేయడానికి ఇది అవకాశం కల్పించవచ్చునని ఆమె అన్నారు. 'ఇంతవరకు మేము మాట్లాడని దేశాలతో చర్చలు ప్రారంభించడానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ అది సఫలీకృతమైందా అనేది బేరీజు వేసి చూసేందుకు మాకు తగినంత వ్యవధి లేకపోయింది' అని ఆమె చెప్పారు. 'ఒక్కొక్కసారి ఇటువంటి పరిణామాల వల్ల జనం పరిస్థితులను సహేతుకంగా పరిశీలించవలసి వస్తుంది. అందువల్ల ప్రపంచంలోని ఇతర నేతలు మరింత సీరియస్ గా చర్చలను పరిగణనలోకి తీసుకోగలరు' అని కరిస్సా మార్చ్ అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 10 October, 2009
|