'మా ఒబామాకే ఎందుకు?'
షికాగోలో రిటైరైన 68 సంవత్సరాల జూన్ లాట్రోబ్ ఏమంత ఆనందం వ్యక్తం చేయలేదు.'నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే ఆయన సాధించింది ఇంకా ఏమీ లేదనే అనాలి' అని ఆయన పేర్కొన్నారు.
కాగా, అనేక మంది ఇందుకు హర్షం ప్రకటించారు. అయితే, ఒబామాకు ఎందుకు ఈ అవార్డు ప్రకటించారో వారికీ అంతు పట్టడం లేదు. 'ఇది నిజంగా అద్భుతమే' అని 48 సంవత్సరాల న్యూయార్క్ వాసి, మెడికల్ షాపు ఉద్యోగి డేవిడ్ స్పైరర్ వ్యాఖ్యానించారు. 'ఆయన ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. కాని ఆయన ఏమి చేశారు? మార్పు జరుగుతోంది. అయితే, భవిష్యత్తు కోసం నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వరు కదా' అని స్పైరర్ అన్నారు.
'ఒబామా గెలుచుకున్నారా? నిజంగా? ఆహా' అని న్యూజెర్సీలోని పైన్ బ్రూక్ వాసి 43 సంవత్సరాల డేవిడ్ హసన్ అన్నారు. 'ఆయన అధ్యక్షుడు కనుక అందుకు అర్హుడని అనుకుంటాను. ఆయన తెలివైనవాడే. ఆయన శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని అనుకుంటా' అని డేవిడ్ హసన్ పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 10 October, 2009
|