అంబానీల ముఖాముఖి పోరు
2005 నాటి అంబానీల ఒప్పందంపై కోర్టు కూడా విస్తృత పరిశీలన చేపట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంబానీలు కుదుర్చుకున్న ఆ ఒప్పందం వివరాలు ఎన్నడూ బహిర్గతం కాలేదు. 'అందులో వేరే ఏవైనా ఉన్నాయా అనేది ఎవరికి తెలుసు? ఈ విధమైన పోరు వాటాదారులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. వారికి ఇందులో ఉన్న రిస్క్ ల గురించి తెలుసుకునే హక్కు ఉన్నది' అని 'క్రిస్' అనే పరిశోధనా సంస్థ డైరెక్టర్ అరుణ్ కెజ్రీవాల్ పేర్కొన్నారు.
వక్రించిన అదృష్టం
శిక్షణ ద్వారా కెమికల్ ఇంజనీర్ అయిన 52 సంవత్సరాల ముఖేష్ స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదువును మధ్యలోనే ఆపివేసి 1981లో రిలయన్స్ లో చేరారు. మైక్రోసాఫ్ట్ సిఇఒ స్టీవ్ బాల్మర్ స్టాన్ ఫర్డ్ లో ముఖేష్ అంబానీకి సహాధ్యాయి. వస్త్రపరిశ్రమ రంగంలో పెద్ద సంస్థగా ఉన్న రిలయన్స్ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి రంగాలలో ప్రవేశించడానికి ముఖేష్ కారకుడు.
ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ముఖేష్ గుజరాత్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన 6.60 లక్షల బిపిడి (రోజుకు బ్యారెల్స్) సామర్థ్యం గల యూనిట్ కు పక్కనే కొత్తగా 5.80 లక్షల బిపిడి రిఫైనరీని ప్రారంభించారు. దీనితో ఈ కాంప్లెక్స్ ప్రపంచంలో ఏకైక పెద్ద రిఫైనరీగా ఘనత సాధించింది. రిలయన్స్ ఇన్ఫోకామ్ సంస్థను కూడా ముఖేష్ స్థాపించారు. దీని పేరును ఇప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ గా మార్చారు. ఇది అనిల్ అజమాయిషీలో ఉంది. ముఖేష్ ఇంకా రీటైల్ రంగంలోకి ప్రవేశించి రిలయన్స్ రీటైల్ ను ఏర్పాటు చేశారు. రిలయన్స్ రీటైల్ సంస్థ మార్క్స్ అండ్ స్పెన్సర్ తో సంయుక్త రంగ సంస్థగా లావాదేవీలు సాగిస్తున్నది.
ఇక వార్టన్ నుంచి బిజినెస్ డిగ్రీ పొందిన అనిల్ అంబానీ 'అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్' (అడాగ్)ను స్థాపించారు. ఈ గ్రూప్ విద్యుత్, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, వినోద రంగాలలో వివిధ సంస్థలను నిర్వహిస్తున్నది. బాలీవుడ్ మాజీ నటిని వివాహం చేసుకున్న అనిల్ నెలకొల్పిన రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్ సంస్థ చిత్రాలను సంయుక్తంగా నిర్మించడానికి ఇటీవల స్టీవెన్ స్పీల్ బర్గ్ కు చెందిన డ్రీమ్ వర్క్స్ మూవీ స్టూడియోలో 325 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి జార్జి క్లూనీ, జిమ్ కేరీ, జూలియా రాబర్ట్స్ లతో సహా నటులతో ఒప్పందాలు కుదుర్చుకున్నది.
Pages: -1- 2 -3- News Posted: 19 October, 2009
|