అంబానీల ముఖాముఖి పోరు
మద్యపానం చేయని, హిందూ మతవిశ్వాసాలు గల అనిల్ అంబానీ కొత్త సంస్థలను ప్రారంభించే ముందు ఆలయాలను తరచు సందర్శిస్తుంటారు. ఈ వారం కోర్టు విచారణలు జరగనున్న దృష్ట్యా ఆయన ఇటీవల కొన్ని ఆలయాలను సందర్శించారు కూడా. తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయగల, అందంగా వస్త్రధారణ చేసే అనిల్ అంబానీని 'ఎంటివి యూత్ ఐకాన్'గా ప్రకటించారు. ఆయన కొంత కాలం రాజ్యసభలో సభ్యుడుగా కూడా ఉన్నారు. ఆయన 2006 మార్చిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రోజూ ఉదయం పరుగెత్తుతుండడం వల్ల, ఏటా 'ముంబై రన్' కార్యక్రమంలో పాల్గొంటుండడం వల్ల 'మారథాన్ మ్యాన్'గా పేర్కొంటుండే అనిల్ అంబానీ ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో పెద్ద ఎత్తున స్థానాలు కోల్పోయారు. 10.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 34వ స్థానంలో నిలిచారు. 2008లోని సంపద విలువలో ఇది పావు వంతు మాత్రమే.
కాగా, కొత్త 27 అంతస్తుల నివాస భవనంపై ఒక బిలియన్ డాలర్లు వెచ్చించిన, తన భార్యకు షవర్లు, బార్ తో కూడిన విలాసవంతమైన జెట్ విమానాన్ని కొనుగోలు చేసిన, ముంబైలో 100 మిలియన్ డాలర్లతో క్రికెట్ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసిన ముఖేష్ అంబానీ 19.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉన్నారు. ముఖేష్ ఆధ్వర్యంలోని ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించి ప్రతి ఒక్క వాటాకు ఒక బోనస్ వాటాను క్రితం వారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచిన ముఖేష్ తన వేతనాన్ని మూడింట రెండు వంతులు తగ్గించుకోనున్నట్లు గురువారం (15న) తెలియజేశారు. కార్పొరేట్ సంస్థలలో ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు మరీ విపరీత స్థాయిలో ఉంటున్నాయని ప్రధాని, ఒక కేంద్ర మంత్రి, ఇతర అధికారులు వ్యాఖ్యానించిన కొన్నిరోజులకే ముఖేష్ తన వేతనంలో కోతను ప్రకటించుకున్నారు.
అయితే, ప్రజల నుంచి మద్దతు సమీకరణకు సోదరులిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావచ్చు. 'వారి ప్రవర్తనకు జనం విసుగు చెందారని, సహనం కోల్పోయారని, విశ్వాసం కూడా కొంత తగ్గిందని నేను అనుకుంటున్నాను' అని కెజ్రీవాల్ పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 19 October, 2009
|