జనారణ్యంలోకి మావోలు! మావోలకు పట్టున్న అటవీ ప్రాంతాల్లో క్షణాల్లో ఖాళీ చేయగలిగే విధంగానే ఉంటాయి. అబూజ్ మఢ్ మినహా చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని మల్కాజ్ గిరి జిల్లాల్లో నక్సల్స్ కు శాశ్వత స్థావరాలు లేవు. స్వల్ప వ్వవధిలో స్థావరాలను ఖాళీ చేయడంలో మావోల శక్తి సామర్థ్యాలు ఆయా ప్రాంతాల్లోని పోలీసుల అధికారులకు సుపరిచితమే. 'క్షేత్ర స్థాయిలో అరాకొర నిఘా సమాచారంతో దాడులుచేయడం సమర్ధనీయం కాదు. అమాయకులు వేధింపులకు గురైతే ప్రతిఘటన మొదలవుతుంది. నక్సల్స్ తమ తావులనుంచి జారుకున్న తరువాత భద్రతా బలగాలు లాల్ గఢ్ లో చేపట్టిన గాలింపు చర్యల్లో జరిగిందిదే. చివరకు భద్రతా బలగాల ఉనికిని స్థానికులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది' అని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రాల మధ్య సరిహద్దుల వివాదాల్లోనక్సల్స్ తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతోనే భద్రతా బలగాలను కేంద్రం రంగంలోకి దింపుతోంది.
రాష్ట్రాల సరిహద్దులతో సంబంధం లేకుండా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడతాయి. అయితే వీటికి స్థానికుల సంప్రదాయాలు, భాష, భౌగోళికత తెలియని కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని అధికారులు అంగీకరిస్తున్నారు. సీఆర్ పీ ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ 'ఆయుధాలు ఉన్నప్పటికీ ఏ వైపు నుంచీ ఎటువైపు కదలాలన్న విషయం తెలియని కారణంగానే చత్తీస్ గఢ్ లో సిబ్బందిని కోల్పోయాం' అని అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 19 October, 2009
|