జనారణ్యంలోకి మావోలు! మావోయిస్టుల నిర్మూలన వ్యూహంతో హోంమంత్రి చిదంబరం ముందుకు సాగుతున్న వ్యూహం ఏ మేరకు ఫలితాలు ఇస్తుందన్న విషయమై కొంత మంది అధికారులు, నిపుణులు నోరు మెదపడం లేదు. 'యుద్దానికి సిద్ధమవుతున్న రీతిలో ఇటువంటి సన్నాహక చర్యలను బహిరంగంగా ప్రకటించ కూడదు' అని చత్తీస్ గఢ్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. 'ఇది మానసిక యుద్ధమే, అయినా రోజూ ఢిల్లీలో చేసే ప్రకటనల వల్ల మాపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలు మానుంచి ఎక్కువగా ఫలితాలను ఆశిస్తారు. వారు ఆశించిన రీతిలో ఫలితాలను సాధించలేని పక్షంలో మేము పరాజితులుగా మిగులుతాం' అని ఆయన చెప్పారు.
చత్తీస్ గఢ్ ప్రభుత్వానికి కొంతకాలం పాటు సలహాదారుగా పనిచేసిన పోలీసు ఉన్నతాధికారి కేపీఎస్ గిల్ కూడా మావోయిస్టులపై చిదంబరం వ్యూహరచనను తప్పు పట్టారు. 'స్థానికుల సాయంతో అక్కడ సిబ్బంది పోరాటం చేయాలి. ఢిల్లీ గదుల్లో రూపొందించిన ప్రణాళికల అమలుతో విజయం సాధించలేము. స్థానిక అవసరాలకు అనుగుణంగా పోరాట వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది' అని దిల్ వ్యాఖ్యానించారు.
Pages: -1- -2- 3 News Posted: 19 October, 2009
|