కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్!
వీరికి తోడు అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం మంది రాష్ట్రానికి యువ నాయకత్వం రావాలని, వైఎస్ జగన్ అయితే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశపడ్డారు. పైపెచ్చు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సజావుగా, సక్రమంగా కొనసాగాలంటే ఆ తండ్రి బిడ్డ అయిన జగన్ అయితేనే సాధ్యం అవుతుందని, తండ్రి మీద గౌరవంతో అయినా వాటిని అమలు చేస్తారంటున్నారు. అయితే, వేరే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఆ పథకాల అమలు కొనసాగించే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పదే పదే కాంగ్రెస్ నాయకులు చేస్తుండడం వల్లే ముఖ్యమంత్రి రోశయ్య కూడా తనకు అవకాశం చిక్కిన ప్రతిసారీ వైఎస్ ప్రవేశపెట్టి పథకాలను కొనసాగిస్తామని ప్రకటిస్తూనే ఉన్నారు. తాజాగా మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ హైదరాబాద్ లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో కూడా రోశయ్య మాట్లాడుతూ, 'వైఎస్ ఏర్పాటు చేసిన మంత్రిమండలినే కొనసాగిస్తున్నానని, ఆయన పథకాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తానని చెప్పుకోవడం విశేషం.
మరో పక్కన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే, ఇంతకాలం వైఎస్ రాజశేఖరరెడ్డి నీడలో ఉండాల్సిన తమకు మళ్ళీ అదే పరిస్థితి తలెత్తుతుందనే ఉలికిపాటు కొందరిలో కలిగింది. ఎలాగైనా జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కనివ్వకుండా చేయాలన్న వ్యూహంతో వారంతా ఢిల్లీ స్థాయిలో 'పావులు' కదిపారు. అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తామంతా మద్దతు తెలుపుతామని చెబుతూనే జగన్ విషయంలో మాత్రం తమ శక్తి మేరకు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ క్రమంలో ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ పీసిసి చీఫ్ కె. కేశవరావు, పిసిసి చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి తదితరులు ఈ క్రమంలో పనిచేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అమలాపురం ఎంపి హర్షకుమార్ అయితే, జగన్ కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేసి వివాదాన్ని మరింత పెద్దది చేశారు.
Pages: -1- 2 -3- News Posted: 21 October, 2009
|