బామ్మల సాకర్ ఆరాటం
ప్రపంచ కప్ పోటీల మొదటి రౌండ్ కు ముందు 'కర్టెన్ రైజర్' (సన్నాహక పోటీ) ఆడతామని జట్టు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించగలమని జాతీయ సాకర్ సంస్థ అధికారులు జట్టుకు తెలియజేశారు.
వృద్ధ మహిళలు కాళ్లు, చేతులు సాగదీసుకోవడానికి వీలుగాను, జీవితంలో వారికి కొత్త అర్థాన్ని ఇవ్వడానికి తాను మూడేళ్ల క్రితం జట్టును ప్రారంభించానని సంఘ సేవిక బెకా నతన్వీసి తెలియజేశారు. 'వారిలో కొందరు సరిగ్గా నడవలేకపోయేవారు. తీరిక వేళల్లో వారు చేసేదేమైనా ఉంటే అది కుట్టడం లేదా కూర్చొనడం మాత్రమే అవుతుండేది. ఇప్పుడు వారు పరుగెత్తుతుంటారు, అరుస్తుంటారు, మీతో కుస్తీకైనా సిద్ధపడుతుంటారు. ఇది వారిని చిన్నవారిని చేస్తుంటుంది' అని ఆమె వివరించారు.
ఏ ఇతర కోచింగ్ పని కన్నా మహిళలకు శిక్షణ ఇవ్వడం తనకు ఇతోధికంగా సంతృప్తి ఇచ్చిందని కోచ్ డేవిడ్ మాకె చెప్పారు. 'యువకులకు మీరు శిక్షణ ఇవ్వాలంటే ఏది సాధించాలన్నా డబ్బు కావాలి. ఇక్కడికి నేను మానసిక ఒత్తిడితో వచ్చి ఉండవచ్చు. కాని సర్వం మరచిపోయేంతగా నేను నవ్వుకోగలను' అని ఆయన చెప్పారు.
Pages: -1- 2 -3- News Posted: 23 October, 2009
|