బామ్మల సాకర్ ఆరాటం
అయితే, జట్టుకు తగినన్ని నిధులు లేవు. ఇతర ప్రాంతాలలోని జట్లతో ద్వైవార్షిక పోటీల కోసం ప్రతి మహిళ సాకర్ బంతులు, కిట్, ప్రయాణం కోసం నెలకు సుమారు ఒక డాలర్ వంతున అందజేస్తుంటుంది. జట్లకు నిధుల కోసం సొంత డబ్బు వెచ్చిస్తుండే నతన్వీసి ఏదో ఒక రోజు స్పాన్సర్లను రప్పించగలనని ఆశిస్తున్నారు.
ఇక డజన్ల కొద్దీ స్థానిక అభిమానులు బామ్మల పోటీలకు వత్తాసు పలుకుతుంటారు. దక్షిణాఫ్రికా సాకర్ కే ప్రత్యేకమైన వాద్య సంగీతాన్ని ప్లాస్టిక్ ట్రంపెట్ లతో పోటీల సమయంలో వారు వినిపిస్తుంటారు. 'బామ్మలు సాకర్ ఆడుతుంటే చూడడం నాకు బాగుంటుంది. దీని వల్ల వారు ఫిట్ గా, బలంగా ఉండగలరు' అని 13 ఏళ్ల చామెలియుస్ బయాని చెప్పాడు.
అయితే, విజయానికి వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. రోజంతా పని చేసిన మీదట సాకర్ గేము ఆడడానికి కొందరు బామ్మలు కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. తమ ఇళ్ళను శుభ్రం చేసుకుని, అన్నం వండుకుని లేదా బస్తీ వీధులలో ఆహార పదార్థాలు అమ్మి చాలా మంది నేరుగా సాకర్ ప్రాక్టీస్ కోసం వస్తుంటారు. అయితే, ప్రాక్టీస్ కు గైర్ హాజరు కావడం కలలోని మాట అని వారంటుంటారు. 'నేను స్థూలకాయురాలిని. కాని నేను ఇప్పుడు పరుగెత్తగలను. బంతిని ఎలా తన్నాలో మా మనవలు, మనవరాళ్ళకు నేర్పగలను. ఇలా చేయడం ఎంతో గొప్పగా ఉంది' అని బలోయి చెప్పింది.
Pages: -1- -2- 3 News Posted: 23 October, 2009
|