కోర్టుల్లో ఇక వాయిదాలుండవ్!
'ట్రాఫిక్ నేరాలు లేదా బెయిలబుల్ నేరాలకు సంబంధించిన కేసులన్నిటినీ వెబ్, వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పరిష్కరించవచ్చు' అని ఈ లక్ష్య పత్రం సూచిస్తున్నది. అయితే, 'వాయిదాలు ఉండరాదు' అనే ప్రతిపాదన మాత్రం సాహసోపేతమైనదే. ప్రత్యర్థి పక్షాన్ని చికాకు పరచడానికి ఏదో ఒక సాకుతో దావా విచారణ వాయిదాను కక్షిదారులు కోరే అలవాటుకు స్వస్తి చెప్పించడం ద్వారా న్యాయస్థానాలలో జాప్యాలను తొలగించడానికి ఉద్దేశించిన ప్రతిపాదన ఇది.
'పదేపదే వాయిదాలు కోరుతుండడం, యథాలాపంగా కోర్టులు మంజూరు చేయడం భారతీయ న్యాయ వ్యవస్థకు శాపంగా పరిణమించాయి' అని ఈ పత్రం పేర్కొంటున్నది. కేంద్ర న్యాయ శాఖ మంత్రిని సంప్రదించి అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి, సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ విద్యావేత్త మాధవ్ మీనన్ ఈ పత్రానికి రూపకల్పన చేశారు.
మందకొడిగా సాగే భారతీయ న్యాయ వ్యవస్థలో చురుకుదనం తీసుకురావడానికి 'వాయిదాలు ఉండరాదు' అనే లక్ష్యం దోహదం చేయగలదని, ఇందుకు కావలసిన చర్యలను సూచించగలదని భావిస్తున్నారు. యథాలాపంగా వాయిదాలు మంజూరు చేస్తుండే న్యాయమూర్తులను గుర్తించి వారు తమ పంథాను సరిచేసుకునేందుకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఈ పత్రం సూచిస్తున్నది.
Pages: -1- 2 -3- News Posted: 24 October, 2009
|