కోర్టుల్లో ఇక వాయిదాలుండవ్!
మరొక ముఖ్యమైన సంస్కరణ న్యాయమూర్తుల ఎంపిక మండలి (కలీజీయం) వ్యవస్థలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి తీసుకుంటున్న వ్యవధిని ఆరు మాసాలు, ఏడాది మధ్యకు తగ్గించడం. ఈ మండలి సిఫార్సులపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం నెలల తరబడి జాప్యం చేస్తుంటుంది. హైకోర్టులలో 886 న్యాయమూర్తుల పోస్టులకు 234 పోస్టులు ఖాళీగా ఉండడంతో ఈ ప్రక్రియను కేవలం ఎనిమిది వారాలలో పూర్తి చేయవలసిన తరుణం ఆసన్నమైందని ప్రభుత్వం భావిస్తున్నది.
దేశవ్యాప్తంగా ట్రయల్ (విచారణ) కోర్టులలో పెండింగ్ లో ఉన్న 2.74 కోట్ల కేసులను తేల్చేందుకు 15 వేల మంది అడ్ హాక్ జడ్జీలను రిక్రూట్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రిటైరైన జడ్జీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్లీడర్లు, సీనియర్ న్యాయవాదులలో నుంచి వారిని రిక్రూట్ చేస్తారు. నెలకు రూ. 50 వేల ఫిక్సెడ్ జీతంతో రెండేళ్ళ కాలానికి వారిని నియమిస్తారు.
దిగువ కోర్టులలో న్యాయాధికారుల ఖాళీల భర్తీకి కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. వీటికి ప్రస్తుతం పత్రికలలో ప్రకటించిన తేదీ నుంచి నియామకం వరకు సుమారు ఒక ఏడాది పట్టుతున్నది. ఈ మొత్తం ప్రక్రియను కేవలం 14 వారాలకు కుదించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ముఖ్యంగా న్యాయాధికారుల ఎంపిక కమిటీని విస్తరించాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ప్రస్తుతం ఈ కమిటీలో జడ్జీలు మాత్రమే ఉంటున్నారు. ఇకమీదట ఈ కమిటీలో బార్ నాయకులు, ఇతర స్వతంత్ర భాగస్వామి సంస్థల నాయకులను కూడా చేర్చాలని ప్రభుత్వ యోచన. దిగువ న్యాయస్థానం స్థాయిలో జాతీయ జ్యుడీషియల్ కమిషన్ (ఎన్ జెసి) సూత్రాన్ని అమలుకు చేస్తున్న ప్రయత్నంగా ఇది కనిపిస్తున్నది.
Pages: -1- -2- 3 News Posted: 24 October, 2009
|